Telangana News : చెక్ పోస్ట్‌లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అంతలోనే ఓ కారు అటువైపుగా వచ్చింది. చెక్ పోస్టును కేర్ చేయకుండా దూసుకుపోయింది. ఖాకీలు కంగు తిన్నారు. వెంటనే ఛేజింగ్ మొదలుపెట్టారు. రోడ్డుపై కారు దూసుకుపోతోంది. పోలీసులు ఛేజ్ చేస్తున్నారు. ఎవరూ స్పీడ్ తగ్గట్లే. ఎక్స్‌లేజర్‌ను తెగ తొక్కేస్తున్నారు. ముందు కారు.. వెనకాలే పోలీస్ వెహికిల్. రయ్ రయ్ మంటూ పోలీస్ సైరన్ మోగుతోంది. చాలా కిలోమీటర్లు అలా రోడ్డుపై సినిమాటిక్ ఛేజింగ్ నడిచింది. చివరాఖరికి పోలీసులు ఆ కారును ఆపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కారులో ఏముంది?
చెక్ పోస్ట్‌లో ఆపకుండా ఎందుకిలా పారిపోతున్నావని ప్రశ్నించారు. ఆ డ్రైవర్ నుంచి సమాధానం లేదు. పోలీసులు ఎంతగా అడిగినా ఆ కారు అతను నోరు మెదపలేదు. పోలీసులు గంజాయి కేసేమో అనుకున్నారు. కారును తనిఖీ చేయడం స్టార్ట్ చేశారు. డ్రైవర్ క్యాబిన్ మొత్తం వెతికారు. గంజాయి గట్రా ఏమీ దొరకలేదు. బ్యాక్ సీట్‌లోనూ మొత్తం చెక్ చేశారు అనుమానించాల్సిన వస్తువులేవీ లేవు. లాస్ట్‌కు డిక్కీ ఓపెన్ చేయమన్నారు. వద్దు సార్.. వద్దు సార్ అంటూ ఆ డ్రైవర్ కంగారు పడ్డాడు. పోలీసులు అలర్ట్ అయ్యారు. కారు డిక్కీలో ఏదో ఉందని డిసైడ్ అయ్యారు. డిక్కీ తెరిచి చూశారు. అంతే.. పోలీసులంతా షాక్.
కారు డిక్కీలో డెడ్‌బాడీ.. అందుకేనా?
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ ఉండటం చూసి ఖాకీలు కంగుతిన్నారు. ఆ మహిళను హత్య చేసి.. శవాన్ని గప్‌చుప్‌గా మాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడని డిసైడ్ అయ్యారు. కారు నడిపిన రాజేశ్‌ను అదుపులో తీసుకున్నారు. చనిపోయిన మహిళను కమలగా గుర్తించారు.
ఆ మహిళ హత్యకు రీజన్ ఏంటి?
కమలను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎలా చంపారు? డెడ్‌బాడీని కారులో ఎక్కడికి తరలిస్తున్నారు? చంపింది ఆ కారు నడిపిన రాజేశేనా? వేరే వాళ్లు చంపి రాజేశ్ కారులో మృతదేహం తరలిస్తున్నారా? రాజేశ్‌కు చనిపోయిన కమలకు సంబంధం ఉందా? వారిద్దరూ ఎవరు? భార్యాభర్తలా? అక్రమ సంబంధమా? ఇలా ప్రాథమికంగా అనేక ప్రశ్నలు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. ఈ కారు ఛేజింగ్ ఘటన నిజామాబాద్, దాస్ నగర్ శివారు.. నిజాంసాగర్ కెనాల్ దగ్గర జరిగింది.