Madraskaaran – Game Changer:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కుటుంబం నుంచి వచ్చిన చాలామంది హీరోలు సినిమాలలో స్టార్ స్టేటస్ ను అందుకోవడమే కాదు రాజకీయాలలో కూడా కీలకమైన పదవులలో కొనసాగుతున్నారు. ఇకపోతే అతిపెద్ద ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ మెగా కుటుంబం నుంచి చాలామంది ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టారు. కానీ.. నిహారిక (Niharika) మినహా ఏ ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. కుటుంబం యొక్క ఇమేజ్ తో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంది నిహారిక. కానీ ఆమె కలలు రూపం దాల్చలేదు.
మద్రాస్ కారన్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగనున్న నిహారిక..
తొలుత యాంకర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన నిహారిక, ఆ తర్వాత ‘ఒక మనసు’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా అవతారం ఎత్తింది. సినిమా యావరేజ్ గా నిలవడంతో ఈమెకు కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. అలా అడపాదడపా కొన్ని సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత ఇంట్లో పెద్దల కోరిక మేరకు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొంతకాలానికి భర్తకు విడాకులు ఇచ్చి, ఎన్నో ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని, ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే బ్యానర్ ను స్థాపించి పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ దూసుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించి, నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక ఇప్పుడు తమిళ్లో ‘మద్రాస్ కారన్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. షాన్ నిగమ్, కలైరాసన్ హీరోలుగా.. నిహారిక కొణిదెల , ఐశ్వర్య దుత్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగబోతోంది.
గేమ్ ఛేంజర్ మూవీతో పోటీకి సిద్ధం.
మరొకవైపు తన అన్న గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) కూడా అదే రోజు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకి తమిళ్లో పెద్దగా గుర్తింపు లభించడం లేదు. అందుకే ఈ సినిమా డైరెక్టర్ శంకర్ (Shankar)కూడా ఈ సినిమాకు పోటీగా వచ్చిన అజిత్ (Ajith) ‘విడాముయార్చి’ సినిమాని కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలతో మాట్లాడి విడుదలను వాయిదా వేయించారు. మరి ఇలాంటి సమయంలో ఈ సినిమాకి పోటీగా నిహారిక సినిమా రంగంలోకి దిగడంతో పోటీ నెలకొంది. మరి ఈ రెండు సినిమాలలో అక్కడి ప్రేక్షకులు ఏ సినిమాకి ఓటేస్తారో అనే విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
తమిళ్ ఆడియన్స్ ని మెప్పించేదెవరు..
ఇదిలా ఉండగా ఇప్పటికే మద్రాస్ కారన్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఒక రీమేక్ సాంగ్ లో నిహారిక మునుపెన్నడు నటించని విధంగా నటించింది. దీంతో ఇది కాస్త బాగా వైరల్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఇక గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈరోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గెస్ట్ గా రాబోతున్నారు.