WhatsApp : వాట్సప్ (Whatsapp).. మెటా(Meta) తీసుకొచ్చిన ఈ మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమ యూజర్స్ సౌకర్యార్థం ఎన్నో ఫీచర్స్ ను తీసుకువచ్చిన మెటా తాజాగా మరిన్ని అదిరిపోయే బెనిఫిట్ ను అందిస్తోంది. ఇకపై వాట్సాప్ లో బుక్ క్యాబ్ బుక్ చేసుకునే ఛాన్స్ ఇచ్చేసింది మెటా. మరి.. ఈ ఉబర్ క్యాబ్ ను వాట్సాప్ లో ఎలా బుక్ చేయాలి? డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఉబర్ క్యాబ్ బుక్ చేయాలంటే ఉబర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఇక ఈ రోజుల్లో స్టోరేజ్ సమస్య లేదా ఇంకా ఏవైనా ఇతర కారణాలతో యాప్ ను ఇన్స్టాల్ చేసుకోకుండానే క్యాబ్ ను బుక్ చేసే ఛాన్స్ ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. ఇలాంటి వారి కోసమే బుక్ చేయాలనుకున్న ప్రతిసారి యాప్ ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా.. వాట్సాప్ లోనే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది మెటా. అయితే ఇందుకు కొన్ని స్టెప్స్ మాత్రం ఫాలో అవ్వాలి.
వాట్సప్ లో ఉబర్ క్యాబ్ బుక్ ఎలా బుక్ చేయాలంటే –
వాట్సాప్ లో ఉబర్ క్యాబ్ బుక్ చేయాలంటే.. ఇందుకోసం ఫోన్ లో 7292000002 నెంబర్ సేవ్ చేసే సరిపోతుంది. ఇక ఈ నెంబర్ ను సేవ్ చేసిన తర్వాత ఫోన్ వాట్సాప్ కాంటాక్ట్స్ లో నెంబర్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేయాలి. సేవ్ చేసిన కొత్త నెంబర్ కనిపించిన వెంటనే చాటింగ్ ఓపెన్ చేసి హాయ్ సందేశాన్ని పంపించాలి. ఇక ఇప్పుడు లాంగ్వేజ్ ఆప్షన్ ను అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇందులో హిందీ, ఇంగ్లీష్ ను ఎంచుకోవచ్చు. ఇక లొకేషన్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాబ్ బుక్ అవుతుంది. డ్రైవర్ వివరాలతో పాటు ఇందుకు సంబంధించిన షేర్ పిన్, కాంటాక్ట్ నెంబర్ వంటి వివరాలు వాట్సాప్ లో కనిపిస్తాయి.
రాపిడో వంటి ఇతర బుకింగ్ సైట్స్ లో ఉన్నట్టే ఓటీపీ చెప్పగానే డ్రైవర్ రైడ్ స్టార్ట్ చేస్తాడు. రైడ్ పూర్తయ్యాక డబ్బులు చెల్లించి రేటింగ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఈ సర్వీస్ ఒక్కో ఫోన్ లో ఒక్కో విధంగా పనిచేస్తుందని తెలుస్తోంది. హాయ్ సందేశాన్ని పంపించిన వెంటనే ఎటువంటి రిప్లై రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. వెంటనే లాగిన్ అయ్యి.. లాగిన్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి కావాల్సిన సమాచారాల్ని నమోదు చేసుకోవచ్చు. రిజిస్టర్ నెంబర్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి పాస్వర్డ్ నమోదు చేస్తే ఆపై క్యాబ్ ను మళ్ళీ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇక మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉంటుందని టెక్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. నిత్యం లక్షల మంది ఉపయోగించే క్యాబ్ బుకింగ్.. వాట్సాప్ లో కనిపిస్తే యూజర్స్ కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ALSO READ : ఐఫోన్ యూజర్స్ సంభాషణలపై సిరి నిఘా.. రూ.814కోట్ల సెట్మెంట్ కు యాపిల్ రెడీ