CM Revanth Reddy:నీటిపారుదల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని.. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని కూడా సీఎం స్పష్టం చేశారు.
గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవలే ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తెచ్చారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని కూడా సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో AP CS కి తమ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు GRMB తో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కూడా తమ అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ క్యాబినేట్ సమావేశం జరిగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచనున్నారు. వీటితో పాటు పలు కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. 200 కొత్త గ్రామ పంచాయితీలు, 11 కొత్త మండలాలకు క్యాబినేట్ ఆమోదం తెలుపనుంది. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి, హైబ్రీడ్ పద్దతిలో రోడ్ల నిర్మాణంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసాపై విధివిధానాలు క్యాబినెట్ ప్రకటించనుంది. యాదిగిరిగుట్ట ఆలయ బోర్డు సహా భూమి లేని నిరుపేదలకు 12,000 ఆర్థిక సహాయంపైనా చర్చించనున్నారు.
ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక ప్రకారం ఏబిసిడి వర్గీకరణపైనా మంత్రిమండలి చర్చించనుంది. దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల విధివిధానాలపై చర్చ సాగనుంది. ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం ఇచ్చేందుకు కసరత్తు చేయనున్నారు. కులగణన ఆన్ లైన్ పూర్తి కావస్తునందున ఆ గణాంకాలను డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చేందుకు క్యాబినెట్ లో చర్చిస్తారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలపైనా చర్చ సాగనుంది. రీజినల్ రింగ్ రోడ్లు.. వాటి కింద కోల్పోతున్న భూములు, అటవీ శాఖ క్లియరెన్స్ లపై చర్చించనున్నట్లు సమాచారం. ఎకో టూరిజం డెవలప్మెట్ పై క్యాబినెట్ చర్చించనుంది. టూరిజం పాలసీపై క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై చర్చించనున్నారు.
Also Read: కులగణన సర్వేలో సంచలన విషయాలు.. క్రెడిట్ రేవంత్ సర్కార్‌దే
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు.. సబ్సిడీపై ఇసుక, స్టీల్, సిమెంటు ఇచ్చే అవకాశంపై క్యాబినెట్ చర్చించనుంది. సిట్టింగ్, మాజీ శాసనసభ్యుల కోసం తెలంగాణ ప్రభుత్వం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ను ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్థానంలో కట్టేందుకు మంత్రి మండలిలో చర్చించే అవకాశం ఉంది.