Game Changer : టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్ ‘.. తమిళ విలక్షణ దర్శకుడు శంకర్ ఈ సినిమాను భారీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటివరకు విడుదలైన పోస్టర్ల్స్, సాంగ్స్ ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సినిమాని పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో శంకర్ తెరకెక్కిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దాదాపుగా రూ. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. దాంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను అప్పుడే మొదలెట్టేశారు.. ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు.. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
‘గేమ్ ఛేంజర్ ‘ టీజర్ ఎలా ఉందంటే?
గేమ్ ఛేంజర్ టీజర్ ను చూస్తే.. రామ్ చరణ్ ఎంట్రీ అదుర్స్.. మాస్, యాక్షన్ సీన్స్ తో విజువల్స్ అదిరిపోయాయని చెప్పాలి. అక్కడక్కడ వీడియో గేమ్ లా ఉందనే టాక్ ను అందుకుంది.. అలాగే పవన్ కళ్యాణ్ లా రామ్ చరణ్ కనిపించాడనే టాక్ ను అందుకుంటుంది. కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది.. రామ్ చరణ్ ఈజ్ బ్యాక్ అని రచ్చ సినిమాను చూపించారు. అలాగే పవర్ ఫుల్ హెలికాప్టర్ షాట్, అలాగే ఫైట్ సీన్స్ తో మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ కిక్కు ఇచ్చేసింది. టీజర్ కు మాస్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. గేమ్ ఛేంజర్ టీజర్ ను యూపీలోని లక్నో లో టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేశారు. ఈ ఒక్క వీడియో సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి టాక్ ను అందుకున్నాయి. కానీ సాంగ్స్ మాత్రం విమర్శలు అందుకున్నాయి.. టీజర్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది.. సినిమాను ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
ఈ సినిమాను మొదట డిసెంబర్ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అయితే రామ్ చరణ్ ఇమేజ్, శంకర్ డైరెక్షన్, నిర్మాత దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీ వీటన్నింటినీ బేస్ చేసుకుని గేమ్ ఛేంజర్ సినిమా దాదాపుగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేయబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. మరి ఆ అంచనాలను రీచ్ అయ్యేలా గేమ్ చేంజర్ రిజల్ట్ ఉంటుందా చూడాలి. ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చెయ్యక తప్పదు. ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో Rc16 సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ తో రంగస్థలం 2 సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత హాలీవుడ్ సినిమాను చెయ్యనున్నట్లు టాక్..