Ram Charan: ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తిపలుకుతూ.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ వివాహం చేసుకోబోతోంది. తాజాగా నిశ్చితార్థం జరుపుకొని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇవి కాస్తా వైరల్ అవడంతో వరుడు ఎవరు..? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?అనే విషయాలు వైరల్ అవుతున్నాయి.
రూబా రూబా పాటతో..
2010 నవంబర్ 26వ తేదీన ప్రముఖ డైరెక్టర్ భాస్కర్ (Bhaskar )దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆరెంజ్(Orange). తెలుగు ప్రేమా కథ చిత్రం గా వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan), జెనీలియా(Genelia ) జంటగా నటించారు. ఇందులో షాజన్ పదంసీ(Shazan Padamsee), ప్రకాష్ రాజ్ (Prakash Raj), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కథ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను నిరాశపరిచినా.. మ్యూజికల్ గా భారీ సక్సెస్ అందుకుంది. అందులో “రూబా రూబా”పాట కూడా ఒకటి. ఈ పాటలో నటించిన షాజన్ పదంసీ తన అద్భుతమైన నటనతో , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అలా రామ్ చరణ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా నిశ్చితార్థం చేసుకుంది.
బిజినెస్ మాన్ తో నిశ్చితార్థం..
తన ప్రియుడు ఆశిష్ కనాకియా (Asique kanakia) అనే బిజినెస్ మాన్ తో త్వరలో ఏడడుగులు వేయబోతోంది. గత కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోని నిశ్చితార్థం కూడా చేసుకుంది .ఈ విషయాన్ని ఈమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.” కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు ఆగలేకపోతున్నాను” అంటూ కూడా తెలిపింది.
షాజన్ పదం సీ కెరియర్..
ముంబై కి చెందిన షాజన్ పదం సీ 2010లో ‘రాకెట్ సింగ్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాది తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఆరెంజ్’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత రామ్(Ram ), వెంకటేష్ (Venkatesh) కాంబినేషన్లో వచ్చిన ‘మసాలా’ సినిమాలో కూడా నటించింది. మరో తెలుగు సినిమాలో నటించని ఈమె తన కెరీర్లో కేవలం 7 సినిమాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం జీవోఎటీస్ అనే టీవీ షో చేస్తోంది .ఇకపోతే ఆశిష్ కనాకియా , షాజన్ పదంసీ వచ్చే ఏడాది వివాహం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నెటిజన్స్ కామెంట్స్..
“రూబా రూబా” అనే పాటలో కనిపించి, ఎంతోమంది హృదయాలను దోచుకున్న ఈమె ముఖ్యంగా అబ్బాయిల కలల రాకుమారిగా పేరు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోవడంతో అభిమానులు మా గుండెలు ముక్కలు అయ్యాయి అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొంతమంది నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికైతే రామ్ చరణ్ హీరోయిన్ ఇప్పుడు ఒక ఇంటికి కోడలు కాబోతోంది. ప్రస్తుతం షాజన్ పదంసీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.