Triple Super Over: టి -20 ల్లో ఓ మ్యాచ్ డ్రా గా ముగిసినప్పుడు వినిపించే మాట సూపర్ ఓవర్. అంటే ఇరుజట్లకు చెరో ఓవర్ ని కేటాయించి మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం జరుగుతుంది. అయితే టి-20 ల్లో ఒక సూపర్ ఓవర్ ఆడడమే చాలా అరుదుగా జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఒకే మ్యాచ్ లో మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వస్తే.. ఇక చూసే ఫ్యాన్స్ కి తీవ్ర ఉత్కంఠ కలుగుతుంది.
Also Read: Mark Taylor-kohli: ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విరాట్ కోహ్లీ సీక్రెట్ రిలేషన్?
ఇలా ఓ ఇంటర్నేషనల్ టి-20 మ్యాచ్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. స్కాట్ల్యాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్న టి-20 ట్రై సిరీస్ 2025 లో భాగంగా {Nepal – Netherlands} జట్ల మధ్య జరిగిన 2వ టి-20 మ్యాచ్ టై గా ముగిసింది. అంతేకాకుండా మూడు సూపర్ ఓవర్ల తర్వాత మ్యాచ్ ఫలితం తేలడం ఓ చారిత్రాత్మక సంఘటనగా నిలిచింది. క్రికెట్ చరిత్రలోనే మూడు సూపర్ ఓవర్లు ఆడిన మొదటి టీ-20 మ్యాచ్ ఇదే. ఈ ఆసక్తికరమైన మ్యాచ్ టిట్ వుడ్ మైదానంలో జరిగింది.
జూన్ 16 {సోమవారం} రోజు రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన నేపాల్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇక చేజింగ్ కి దిగిన నేపాల్ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. భారత సంతతికి చెందిన క్రికెటర్, నేపాల్ జట్టు కెప్టెన్ రోహిత్ పాడేల్ ఈ మ్యాచ్ లో {48} తో మెరిసాడు.
నేపాల్ తరఫున నందన్ యాదవ్ చివరి బంతికి ఫోర్ కొట్టడం ద్వారా స్కోర్ ని సమం చేశాడు. ఇది మ్యాచ్ ని సూపర్ ఓవర్ కి తీసుకువెళ్లింది. ఇలా జరిగిన మొదటి సూపర్ ఓవర్ లో నేపాల్ ఒక ఓవర్ లో 19/1 స్కోర్ చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్ జట్టు కూడా సరిగ్గా 19 పరుగులే చేసింది. ఈ నేపథ్యంలో రిజల్ట్ కోసం మరో సూపర్ ఓవర్ ని నిర్వహించాల్సి వచ్చింది. ఇలా ఉత్కంఠను మరింత పెంచుతూ సెకండ్ సూపర్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్ 17/1 పరుగులు చేసింది. ఆ తరువాత ఆశ్చర్యకరంగా నేపాల్ కూడా సరిగ్గా 17 పరుగులు సాధించింది.
Also Read: SRH -Kavya Maran: హైదరాబాద్ ఓనర్ కావ్య పాపకు డబ్బులు ఎలా వస్తాయి.. ఇంతలా ఎలా సంపాదిస్తోంది?
ఈ క్రమంలో రెండవ సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మూడవ సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. అయితే ఈ మూడవలో నేపాల్ జట్టు ఖాతా తెరవలేకపోయింది. రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత నెదర్ల్యాండ్ మొదటి బంతికే సిక్స్ కొట్టి మ్యాచ్ ని గెలుపొందింది. ఇలా మూడు సూపర్ ఓవర్ల థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నెదర్లాండ్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్ తరఫున తేజ నిడమనూరు {35} అత్యధిక పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో డేనియల్ డోరామ్ 4 ఓవర్లలో 14 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.