Ram Charan..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘ఆర్ సి 16’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసి, తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు రామ్ చరణ్ 27వ పుట్టినరోజు. ఆయన తన 40వ జన్మదిన వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ బర్తడే కావడంతో సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈయన పర్సనల్ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆయన తొలిప్రేమ.
ఆమె ప్రేమలో పడ్డ రామ్ చరణ్..
అసలు విషయంలోకి వెళితే.. దాదాపు 17 సంవత్సరాల క్రితం అంటే 2007లో రామ్ చరణ్ ‘చిరుత’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. పూరీ జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాతో రామ్ చరణ్ కి గ్రాండ్ ఎంట్రీ కూడా లభించింది. ఇకపోతే ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan), నేహా శర్మ(Neha Sharma) జంటగా నటించారు. మొదటి సినిమా లోనే చాలా పరిచయం ఉన్న నటీనటులుగా వీరు నటించి, అందరిని తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి గురించి ఎన్నో రూమర్లు బయటపడ్డాయి. అందులో భాగంగానే రామ్ చరణ్ కూడా మొదటిసారి ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా నేహా శర్మ, రామ్ చరణ్ మధ్య ప్రేమ చిగురించిందని, వీరిద్దరూ జంటగా కూడా గడుపుతున్నారు అంటూ అప్పట్లో ఎన్నో రూమర్లు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్పులకి కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ గురించి తనతో పాటు తన కుటుంబానికి కూడా తెలియడంతో ఇక తన తల్లిదండ్రుల రియాక్షన్ చూసి తానే షాక్ అయ్యానని తెలిపారు రామ్ చరణ్.
రామ్ చరణ్ పేరెంట్స్ రియాక్షన్ ఇదే..
రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని..” నాపై రూమర్స్ రావడం విని నేనే షాక్ అయ్యాను. అయితే ఈ విషయం మా నాన్న కూడా తెలిసింది. ఆ సమయంలో మా అమ్మ నాన్న ఒకే ఒక మాట చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు రావడం సహజం. కంగారు పడొద్దు. నీ లైఫ్ పైనే నువ్వు ఫోకస్ చేయి. రూమర్స్ ఎప్పుడు కూడా రూమర్ గానే మిగిలిపోతాయి. అందులో వాస్తవాలు ఉండవు అని.. చెప్పినట్లు ,ఇక తన తల్లిదండ్రుల రియాక్షన్ చూసి తానే ఆశ్చర్యపోయానని రామ్ చరణ్ తెలిపారు. ఇకపోతే రామ్ చరణ్ కు మొదటి ప్రేమ తన భార్య ఉపాసన (Upasana) తోనే కలిగింది అని, నార్మల్ ఫ్రెండ్స్ గా ఉన్న తామిద్దర మధ్య.. పెళ్లికి ఏడాది ముందు మాత్రమే ప్రేమ మొదలైందని, అప్పుడే ఆమెకు ప్రపోజ్ చేశానని, అటు ఉపాసన కూడా అంగీకరించిందని, ఇక వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడడం, సంబంధం కుదరడం , అన్నీ చకచకా జరిగిపోయాయి” అంటూ రాంచరణ్ తెలిపారు. ఇక మొత్తానికైతే రామ్ చరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.