Jofra Archer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో రాజస్థాన్ రాయల్స్ ఈ 18వ సీజన్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడింది. ఆడిన ఈ రెండు మ్యాచ్ లలో ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్చర్ కి టార్చర్ చూపించారు హైదరాబాద్ బ్యాటర్లు. ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్… బీసీసీఐ కీలక ప్రకటన!
ఈ క్రమంలో ఆర్చర్ ఐపిఎల్ కెరీర్ లో అత్యంత చెత్త రికార్డుని మూట కట్టుకున్నాడు. 76 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టకపోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఇంతకుముందు ఇది మోహిత్ శర్మ {73 పరుగులు} పేరిట ఉండేది. గత సంవత్సరం ఐపీఎల్ లో గుజరాత్ కి ప్రాతినిధ్యం వహించిన మోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్లో ఈ చెత్త రికార్డుని నమోదు చేశాడు.
ఇక హైదరాబాద్ తో ఓడిపోయిన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆర్చర్.. “పరీక్షలు ఫెయిల్ అయితే బాధపడకూడదు” అంటూ ట్విట్ చేశాడు. ఇక మరో మ్యాచ్ మార్చ్ 26న కలకత్తా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ తలపడింది. ఈ మ్యాచ్ లో కలకత్తా.. రాజస్థాన్ పై అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో కలకత్తా ఓపెనర్ క్వింటన్ డికాక్ {97*} పరుగులతో చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో కలకత్తా కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పై మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలకత్తా విజయానికి మరో ఏడు పరుగులు అవసరం ఉన్న నేపథ్యంలో 17 ఓవర్ వేసిన ఆర్చర్.. వరుసగా రెండు వైడ్లు వేశాడు.
దీంతో విజయానికి మరో ఐదు పరుగులు కావాల్సి ఉంది. ఇక మూడవ బంతిని డికాక్ సిక్స్ గా మలిచాడు. దీంతో కలకత్తా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా 2.3 ఓవర్లు వేసిన ఆర్చర్ ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 33 పరుగులు సమర్పించాడు. ఈ నేపథ్యంలో ఆర్చర్ పై మరోసారి విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.
ఇక రాజస్థాన్ గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఆర్చర్ ని కొనుగోలు చేసింది. రూ. 12.50 కోట్ల భారీ ధరకు ఆర్చర్ ని జట్టులోకి తీసుకుంది. గతంలో కూడా ఆర్చర్ రాజస్థాన్ జట్టుకే ప్రతినిత్యం వహించాడు. ఇలా రాజస్తాన్ జట్టు అంత ధరతో కొనుగోలు చేస్తే.. ఇలా చెత్త ప్రదర్శనతో జట్టు ఓటములకు కారణం అవుతున్నాడని మండిపడుతున్నారు రాజస్థాన్ అభిమానులు.