BigTV English

Game Changer Update: హమ్మయ్య.. ముగింపు దశకు చేరుకున్న ‘గేమ్ ఛేంజర్’

Game Changer Update: హమ్మయ్య.. ముగింపు దశకు చేరుకున్న ‘గేమ్ ఛేంజర్’

Update on Ram Charan’s Game Changer Shooting: కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్లు గడిచినా.. రిలీజ్‌కు మాత్రం నోచుకోవు. మరికొన్ని సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకునేందుకు రెండు మూడేళ్లు పడతాయి. ఆ సినిమాల కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అదీగాక తమ అభిమాన హీరో సినిమా అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు ఒకటే ఆసక్తి చూపిస్తుంటారు.


అలాంటిదే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా. ఎప్పుడో గత రెండేళ్ల క్రితం ‘గేమ్ ఛేంజర్’ మూవీ పట్టాలెక్కింది. కానీ ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోలేదు. రిలీజ్ విషయం పక్కన పెడితే.. ఇంకా షూటింగే కంప్లీట్ చేసుకోలేదు. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ దర్శకుడు శంకర్.. ఒక్క గేమ్ ఛేంజర్ షూటింగ్‌నే కాకుండా తన లైనప్‌లో ‘ఇండియన్ ఫ్రాంచైజీ’ను కూడా పెట్టుకున్నాడు.

అందువల్లనే గేమ్ ఛేంజర్ షూటింగ్‌ పూర్తిగా కంప్లీట్ కాలేకపోయిందని సినీ ఇండస్ట్రీ వాళ్ల టాక్. అయితే మరి ఈ మూవీ కంప్లీట్ అయ్యేదెప్పుడు.. అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలయ్యేదెప్పుడు అని మెగా అభిమానులు, సినీ ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతుందని తెలుస్తోంది.


Also Read: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి మరో లీక్.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే

మరో పదిరోజుల్లో ‘గేమ్ ఛేంజర్’లోని తన పాత్ర మొత్తాన్ని రామ్ చరణ్ కంప్లీట్ చేయనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ పది రోజుల్లో రామ్ చరణ్‌కు సంబంధించిన అన్ని సీన్లను కంప్లీట్ చేసేపనిలో మేకర్స్ పడ్డారని తెలుస్తోంది. దీంతో హమ్మయ్య ఇప్పటికైనా షూటింగ్ పూర్తయ్యే సమయం వచ్చిందని పలువురు అభిమానులు, సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రెండు పాత్రల్లోనూ రామ్ చరణ్ యువకుడి పాత్రలోనే కనిపిస్తున్నాడు. ఇక తండ్రికి జోడీగా నటి అంజలి నటిస్తుండగా.. కొడుకుకి జోడీగా నటి కియారా అద్వానీ కవ్వించబోతుంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×