BigTV English

After Election 2024 Changes in AP: మార్పు మొదలైంది.. ఆంధ్రలో టీడీపీ పాలన ఎలా ఉండబోతుంది..?

After Election 2024 Changes in AP: మార్పు మొదలైంది.. ఆంధ్రలో టీడీపీ పాలన ఎలా ఉండబోతుంది..?

Changes in Andhra Pradesh After NDA Win: ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. అదేంటి ఇంకా ప్రమాణస్వీకారమే చేయలేదు. మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు. అప్పుడు పని ప్రారంభించడం ఏంటనేదే కదా మీ డౌట్.. మీ డౌట్ నిజమే.. కానీ మేం చెప్పేది కూడా నిజమే.. వరుసగా జరుగుతున్న సీన్స్‌ను చూస్తే సీన్ ఏంటో మీకే అర్థమవుతుంది. జూన్ 4.. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమికి ఏకంగా 164 సీట్లలో గెలిచింది. అందులో ఒక్క టీడీపీ అభ్యర్థులు 135 సీట్లలో విక్టరీ సాధించారు. ఏ క్షణమైతే ఈ రిజల్ట్‌పై ఓ క్లారిటీ వచ్చిందో.. అప్పుడే ఏపీలో మార్పులు మొదలయ్యాయి.


జూన్ 5.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కానీ ఏపీలో మాత్రం జరగాల్సింది జరిగిపోతూనే ఉంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్.. సెక్రటేరియట్‌లో తనిఖీలు.. అధికారుల మార్పుపై కసరత్తు.. మంత్రుల చాంబర్లను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకోవడం. ఐటీ విభాగంలో సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను సైతం తనిఖీ చేయడం..ఇలా ఇవన్నీ జస్ట్ 24 గంటలలోపే జరిగాయి. అఫ్‌కోర్స్.. ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు.

నిజానికి చంద్రబాబు అంటేనే గవర్నెన్స్‌, అడ్మినిస్ట్రేషన్.. ప్రతి విషయంలో పక్కాగా ఉంటారన్న పేరు ఉంది. పాలనను.. అధికారులను పరుగులు పెట్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం.. సో.. ప్రమాణస్వీకారం చేసే లోపే పరిస్థితులను చక్కపెట్టే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు.. ఇప్పటికే సీఎస్‌ నుంచి మొదలు పెడితే.. ముఖ్యమైన శాఖల అధిపతులుగా ఉన్న ఐఏఎస్‌ల పనితీరుపై రివ్యూ జరుగుతోంది. మెయిన్‌గా ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న జవహర్‌ రెడ్డిని మార్చే పని వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.


Also Read: ఇండియా కూటమికి అన్ని సీట్లెలా వచ్చాయి ? ఇది ఎవరి పతనానికి సంకేతం?

ఆయనపై ఇప్పటికే భూదందా ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి సీఎస్ పదవిలో కొనసాగడం సరైంది కాదన్న భావనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఆయనను బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు. ఆయన ప్లేస్‌లో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపట్టే చాన్సెస్‌ కూడా కనిపిస్తున్నాయి. మరి ఎవరీ విజయానంద్..? ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో ఇంచార్జీ సీఎస్‌గా కూడా పనిచేశారు. హైలేట్ ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా విజయానంద్ పనిచేశారు. సో పాలనపై గ్రిప్… అనుభవం ఆయనకు ఉన్నట్టుగా భావిస్తున్నారు టీడీపీ పెద్దలు. అంటే కన్ఫామ్‌ అని కాదు.. కానీ ఆయనకు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.

నెక్ట్స్.. చంద్రబాబు చెప్పకనే కొన్ని విషయాలు చెబుతున్నారు. కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పదవులకు చెక్‌ పడబోతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలను చంద్రబాబు డైరెక్ట్‌గా చెప్పడం లేదు. సింపుల్‌గా వారికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. సీఐడీ చీఫ్‌ సంజయ్.. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ PSR ఆంజనేయులు.. సీనియర్ ఐపీఎస్‌ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి.. ఇలా కీలక పదవుల్లో ఉన్న అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బట్.. వారేవ్వరికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు చంద్రబాబు.. సో.. ఇది వారు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టులు ఊస్టింగ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని చెప్పకనే చెబుతోంది.

Also Read: Kethireddy: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన మరో కీలక పరిణామం.. ఏపీ ఫైబర్‌ ఆఫీస్‌ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం.. ఈ ఆఫీస్‌లో ఉన్న ఉద్యోగులందరిని బయటికి పంపేశారు పోలీసులు.. ఆఫీస్‌ను మొత్తం హ్యాండోవర్ చేసుకోని తనిఖీలు చేశారు. ఈ కార్యాలయంలో భారీగా అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. సో.. దీనిపై కూడా చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. సలహాదారులను తప్పించాలని ఆదేశాలు వెళ్లాయి. టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. మంత్రుల చాంబర్లను స్వాధీనం చేసుకున్నారు.. నేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. సో మార్పు అనుకున్నదానికంటే వేగంగా కొనసాగుతోంది అనేది క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని.. వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. సో.. ఈ విషయాన్ని ప్రజలకు క్లియర్‌ కట్‌గా అర్థం అయ్యేలా వివరించేలా ప్లాన్ చేస్తున్నారు..

అంతేకాదు గెలిచిన టీడీపీ ఎంపీలతో భేటీ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని.. బ్యూరోక్రాట్స్ పాలన కాదు.. రాజకీయ పాలన ఉండబోతుందన్నారు. ఐదేళ్లలో నేతలు, కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలిచ్చారని.. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా అధికార పార్టీకి తలొగ్గలేదని గుర్తుచేసుకున్నారు. సో చంద్రబాబు ఇవ్వకనే ఎవరికో వార్నింగ్ ఇస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. ప్రమాణ స్వీకారానికి ముందే పాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు చంద్రబాబు.. నారా చంద్రబాబు నాయుడు అను నేను.. అని అనే సరికి పాలన మొత్తం ఓ గాడిన పడేలా కనిపిస్తుంది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×