E-Paper
Advertisement

Game Changer Shooting Update: హైదరాబాద్‌లో ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్.. వారిద్దరిపై చిత్రీకరణ..!

Game Changer Shooting Update: హైదరాబాద్‌లో ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్.. వారిద్దరిపై చిత్రీకరణ..!
Advertisement

Game Changer Shooting Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ మూవీలో తన యాక్టింగ్‌కు ప్రశంసలు వర్షం కురిసాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో దుమ్ము దులిపేసింది. అంతేకాకుండా ఎన్నో సినిమాల రికార్డులను సైతం కొల్లగొట్టింది. ఆఖరికి ఆస్కార్ బరిలో నిలిచి ఒరిజినల్ సాంగ్‌కు గానూ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అలాంటి ఒక సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’.

ప్రముఖ స్టార్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫేమ్ సంపాదించుకున్న చరణ్‌కు ఈ సినిమాతో ఇంకా మంచి గుర్తింపు తెచ్చిపెట్టేలా రూపొందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Advertisement

ఇందులో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంతకు ముందు చరణ్ అండ్ కియారా కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ ‘గేమ్ ఛేంజర్’తో జతకట్టారు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పట్టాలెక్కి దాదాపు 3 ఏళ్లు అవుతుంది. అయినా ఇంకా సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. అందుకు కూడా కారణాలు ఉన్నాయి. దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్‌తో పాటు ఇండియన్‌ 2 మూవీపై ఫోకస్ పెట్టడంతో ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది.

Also Read: దిల్ రాజ్ తాజా ప్రకటన.. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడంటే..?

Advertisement

ఇక ఇటీవలే ఇండియన్ 2 రిలీజ్ అయింది. అందువల్ల శంకర్ ఫోకస్ అంతా ఇప్పుడు గేమ్ ఛేంజర్ పైనే పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ చేసి త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 70 నుంచి 80 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మూడు రోజుల కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో శ్రీకాంత్, సముద్రఖనిలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో అంజలి, ఎస్ జే సూర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు ఇతర భాషల్లో రిలీజ్ కానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×