BigTV English

Srisailam Jalaharathi: శ్రీశైలంలో మల్లన్న దర్శనం.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

Srisailam Jalaharathi: శ్రీశైలంలో మల్లన్న దర్శనం.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Darshnam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శ్రీశైలం లోని మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లా వెళ్లారు. గుండుమల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకోనున్నారు.


అనంతపురం పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని గురువారం ఉదయం తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. సంప్రదాయ దస్తులు ధరించిన సీఎం చంద్రబాబు తొలుత శ్రీశైలం వెళ్లారు. మార్గ మధ్యలో ఆగి, దేవాలయ అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. ఆలయం వద్దకు చేరుకోగానే వేద పండితులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

ALSO READ: జగన్‌ని వెంటాడుతున్న భయం, ఈసారి..


అక్కడి నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత స్థానిక టీడీపీ నేతలతో కాసేపు మాట్లాడారు సీఎం చంద్రబాబు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా హెలికాఫ్టర్‌‌‌‌‌‌లో అనంతపురానికి చేరుకున్నారు.

మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. పార్టీ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నేరుగా విజయవాడకు చేరుకుంటారు సీఎం చంద్రబాబునాయుడు.

 

Related News

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

AP free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ రైడ్.. ఈ రూల్స్ మర్చిపోతే టికెట్ కట్టుడే!

Big Stories

×