BigTV English

Game Changer : అప్పన్నకు నత్తి.. శంకర్ ట్విస్ట్ మాములుగా లేదు..

Game Changer : అప్పన్నకు నత్తి.. శంకర్ ట్విస్ట్ మాములుగా లేదు..

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈరోజు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఎప్పుడు చూస్తామా అని వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్ కోరిక ఈరోజు తీరింది. ఉదయం నుంచి థియేటర్లలో బొమ్మ పడింది. మూవీ ఫస్ట్ హాఫ్ పూర్తి అయ్యింది.. ఇందులో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయిందనే టాక్ ను సొంతం చేసుకుంది. శంకర్ మార్క్ ను చూపించాడు. అప్పన్న క్యారక్టర్ ను హైలెట్ చేసి చూపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. అప్పన్న క్యారెక్టర్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం…


అప్పన్న క్యారెక్టర్ కు నత్తి.. 

రామ్ చరణ్ సినిమాల్లో ఏదొక లోపం ఉంటుంది. గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ రంగస్థలంలో హీరోకు చెవుడు ఉంటుంది. అదే మూవీని మొత్తం నిలబెట్టింది. సక్సెస్ ను అందుకొనేలా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీలో మూడు క్యారెక్టర్స్ లో రామ్ చరణ్ కనిపిస్తాడని ట్రైలర్ లో చూపించారు. అందులో మొదటి పాత్ర అప్పన్న.. ఈయన అభ్యుదయ భావాలు ఉన్న జనం మెచ్చిన నాయకుడు. ప్రజలకు మంచి చెయ్యాలనే కోరికతోనే రాజకీయాల్లోకి వచ్చాడు. అన్యాయాన్ని ఎదురించాలని పోరాడుతాడు. ఆ పాత్రలో కనిపిస్తున్న రామ్ చరణ్ కు నత్తి ఉన్నట్లు శంకర్ చూపించాడు. ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీలో అప్పన్న పాత్రలో ఓ ఎమోషనల్ షాట్‌ డైరెక్టర్ శంకర్‌నే షాక్ గురి చేసింది. ఆ షాట్‌లో నటనకు రాంచరణ్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం ఖాయమని అంటున్నారు. అదే విషయాన్ని హీరోయిన్ అంజలి కూడా కన్ఫర్మ్ చేసింది.. సెకండ్ పార్ట్ లో ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ లను చూపిస్తారో చూడాలి..


ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. సంక్రాంతి బజ్ ఈ మూవీతో మొదలైందని ట్విట్టర్ లో నెటిజన్స్ చేసే కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది. భారీ అంచనాలతో పాటుగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రీమియర్ షోలు తెలంగాణలో లేవు. కానీ ఆంధ్రలో అర్ధరాత్రి 1 నుంచి మొదటి షో పడింది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను అందుకుంది.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. రెండు రోజులకు బాలయ్య డాకు మహారాజ్ మూవీ పోటీగా రాబోతుంది. అలా మరో రెండు రోజులకు సంక్రాంతికి వస్తున్నాం మూవీ రాబోతుంది. సంక్రాంతికి రేసులో ఏ మూవీ హిట్ టాక్ ను అందుకుంటుందో చూడాలి..

ఫుల్ రివ్యూ & రేటింగ్ కోసం Bigtvlive.com ని ఫాలో అవ్వండి

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×