OTT Movie : హారర్ సినిమాలలో ఉండే దయ్యాలు ప్రేక్షకులను భయపెడుతుంటాయి. అయితే కొన్ని సైకో సినిమాలు చూస్తున్నప్పుడు, వీటికన్నా హారర్ సినిమాలే నయం అనుకుంటాము. సైకోలు చేసే హింస దయ్యాల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో హింస ఎక్కువగా ఉండటంతో, ఈ మూవీని చాలా దేశాలలో బ్యాన్ చేశారు. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలేషియన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘మకాబ్రే‘ (Makabre). విమానాశ్రయానికి వెళ్ళబోతున్న ఒక ఫ్యామిలీకి అనుకోకుండా ఒక సైకో బృందం ఎదురవుతుంది. ఆ సైకోలతో వీళ్ళు ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తన భార్య, ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్లో పని చేస్తున్న తన చెల్లి దగ్గరికి వస్తారు. హీరోకి చెల్లెలికి చిన్న పాటి గొడవలు జరగడంతో, చెల్లెలు అన్నకి కాస్త దూరంగా ఉంటుంది. హీరో ఫ్యామిలీ విదేశాలకు వెళ్లబోతుండగా, చెల్లెల్ని పలకరిద్దామని అక్కడికి వస్తాడు. వీళ్ళందరూ కలిసి అక్కడ డిన్నర్ చేసి ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతుంటారు. రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి, ఆమెను కారులో ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపుతారు. అయితే ఆ అమ్మాయి కాఫీ తాగి వెళ్ళండి అని చెప్పడంతో ఇంట్లోకి వస్తారు. అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాయ ఉంటుంది. వీళ్ళకి స్నాక్స్ ఇచ్చి మాట్లాడుతుండగా, వీళ్ళందరూ నిద్రలోకి జారుకుంటారు. ఆ తర్వాత హీరోతో వచ్చిన ఫ్రెండ్స్ ని ఘోరంగా చంపుతుంటారు. ఇది చూసిన హీరో, భార్యను జాగ్రత్తగా ఉండమని అప్రమత్తం చేస్తాడు. భార్య కూడా గర్భవతిగా ఉండటంతో ఆమెకు తోడుగా వెళ్తాడు. అప్పటికే హీరో ఫ్రెండ్స్ ని మాయా చంపేస్తూ ఉంటుంది. హీరో భార్య ఒక గదిలో ఆ సమయంలోనే ప్రసవిస్తుంది. బిడ్డని చూద్దామనుకునే లోగానే మాయ హీరోని చిత్రహింసలు పెడుతుంది.
హీరో ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి బతికి, అక్కడి నుంచి బయటపడి పోలీస్ వ్యాన్ కింద పడతాడు. అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఈ ఇంటికి వచ్చిన పోలీసులు సెర్చ్ చేస్తారు. విషయం బయట పడుతుందేమో అని, ఆ పోలీసుల్ని మాయ వెంటాడి చంపుతుంది. ఈ క్రమంలో మాయ కూతురు కూడా చనిపోతుంది. కూతురు చనిపోవడంతో మాయకి పిచ్చెక్కుతుంది. మిగిలిన వాళ్ళని చంపడానికి కోపంతో దూసుకు వస్తుంది. చివరికి మాయ చేతిలో వీళ్ళందరూ చనిపోతారా? మాయా ఎందుకు అందరిని చంపుతుంది? వీళ్ళని కాపాడటానికి అక్కడికి ఎవరైనా వస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మకాబ్రే’ (Makabre) మిస్టరీ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.