BigTV English

Allu Arjun: మలయాళ దర్శకుడికి అల్లు అర్జున్ ఫోన్.. దానికోసమేనా.?

Allu Arjun: మలయాళ దర్శకుడికి అల్లు అర్జున్ ఫోన్.. దానికోసమేనా.?

Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ ఏం చేసినా కాంట్రవర్సీలకే దారితీసేలా ఉంది. మామూలుగా ఫ్యాన్సే తన ప్రాణమంటూ కామెంట్స్ చేసే బన్నీకి తన కెరీర్‌లో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ‘పుష్ప 2’తో ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టినా కూడా ఆ రికార్డులను ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేడు అల్లు అర్జున్. ఈ సినిమా ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనే దీనికి కారణం. దాని కారణంగా అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినా కూడా ఇప్పటికీ ఆ విషయంలో అల్లు అర్జున్‌దే తప్పు అంటూ చాలామంది ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఇంతలో ఒక మలయాళ దర్శకుడికి అల్లు అర్జున్ చేసిన ఫోన్ కాల్ గురించి బయటికొచ్చింది.


నేరుగా ఫోన్

మామూలుగా ఏ భాషలో సినిమా హిట్ అయినా.. దానిని సపోర్ట్ చేయడానికి ఇతర భాషలోని మేకర్స్, హీరోలు, హీరోయిన్లు ముందుకొస్తూనే ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) ఒక తెలుగు హీరోనే అయినా తనకు కేరళలో ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. అందుకే ఎప్పటికప్పుడు తన కేరళ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేయడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. అంతే కాకుండా మలయాళ సినిమాలను బాగా ఫాలో అవుతూ వాటిని ప్రశంసించే తెలుగు హీరోల్లో తాను ముందుంటాడు. అదే విధంగా తాజాగా ‘మార్కో’ అనే మూవీపై ప్రశంసలు వర్షం కురిపించాడు బన్నీ. అంతే కాకుండా ఆ మూవీ దర్శకుడు అయిన హనీఫ్ అదెని (Haneef Adeni)కి స్వయంగా ఫోన్ కూడా చేశాడట.


Also Read: ఎండ్ లెస్ బాండింగ్ విత్ బాలయ్య… కన్నీరు పెట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్..!

బన్నీకి నచ్చేసింది

ఇటీవల మలయాళంలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ‘మార్కో’ మూవీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మలయాళంలోనే అతి తక్కువ ప్రమోషన్స్ మధ్య విడుదలయిన ఈ సినిమా మౌత్ టాక్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. మామూలుగా ఇండియన్ సినిమాల్లో వైలెన్స్‌ను మరీ దారుణంగా చూపించడానికి మేకర్స్ ఇష్టపడరు. కానీ ‘మార్కో’ మాత్రం డిఫరెంట్ అని, దానిని సెన్సార్ చేయడం మర్చిపోయారని, ఇందులోని వైలెన్స్‌ను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌కు కూడా ఈ మూవీ విపరీతంగా నచ్చినట్టుంది. అందుకే దీనిని తెరకెక్కించిన హనీఫ్ అదెనికి స్వయంగా ఫోన్ చేసి ప్రశంసించాడు.

మంచి కలెక్షన్స్

ఇప్పటికే కేవలం మలయాళ భాషలోనే దేశవ్యాప్తంగా విడుదలయిన ‘మార్కో’ (Marco) మూవీ రూ.55 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. ఇదే విధంగా మంచి మౌత్ టాక్‌తో దూసుకుపోతే ఈ సినిమా మరో రూ.50 కోట్ల కొట్టడం గ్యారెంటీ అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల తను హీరోగా నటించిన ‘పుష్ఫ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు బన్నీ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×