BigTV English

Upasana Konidela: మెగా కోడలు ఉపాసనకు మరో అరుదైన గౌరవం.. నేషనల్ రేంజర్ అంబాసిడర్‌గా నియామకం

Upasana Konidela: మెగా కోడలు ఉపాసనకు మరో అరుదైన గౌరవం.. నేషనల్ రేంజర్ అంబాసిడర్‌గా నియామకం

Upasana become National Ranger Ambassador: మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు ఇంటి బాధ్యతలతో బిజీ బిజీగా ఉంటూ మరోవైపు వ్యాపార రంగాలలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాగే అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో ఒకరుగా ఉపాసన కొనసాగుతున్నారు. వీటితో పాటు ఇటీవల అత్తమ్మస్ కిచెన్స్ అంటూ మరో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇలా ఒక్కో రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు కొనసాగుతుంది.


అయితే తాజాగా ఉపాసన జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యతను పోషించనున్నారు. ఇందులో భాగంగానే ఆమె వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) ఇండియా విభాగానికి నేషనల్ రేంజర్ అండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అట్టి విషయాన్ని నాగర్‌‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి రీసెంట్‌గా తెలిపారు. అపోలో హాస్పిటల్స్ – వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. మెగా కోడలు ఉపాసన ఈ పదవిలో 4 ఏళ్ల పాటు కొనసాగనున్నారు.

ఇక ఈ ఒప్పందం ప్రకారం.. వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో ఎక్కడైనా గాయపడిన జంతువులు.. పులులు, సింహాలు, ఏనుగులు వంటి ఇతర ప్రాణులకు వైద్యం అందించనున్నారు. అంతేకాకుండా అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో హాస్పిటల్‌లో ఫ్రీ ట్రీట్మెంట్‌ను అందించనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘మానవ వన్యప్రాణుల సంఘర్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే నా హృదయపూర్వక ప్రయత్నం ఈ సహకారంతో బలపడుతుంది. ప్రకృతిని గౌరవించండి, ప్రతిఫలంగా అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది’’ అని ఆమె తన ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ పెట్టారు.


Also Read: చిరంజీవి భార్య సురేఖ ఆవకాయ పచ్చడి చేయడం.. ఉపాసన వీడియో తీయడం ఎంత బాగుందో..!

ఇకపోతే ఉపాసన తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫ్యామిలీ, ఇతర విషయాల గురించి వెల్లడిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమె ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. ఇక రామ్ చరణ్ – ఉపాసన దంపతులు వారి ప్రేమాణురాగాలతో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. రామ్ చరణ్.. ఉపాసనపై చూపించే కేరింగ్ అందరికీ బాగా ఇష్టం.

అంతేకాకుండా ఉపాసన కూడా మెగా ఫ్యామిలీని మరింత స్థాయికి తీసుకెళ్లేందుకు తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మొత్తంగా ఎన్నో పనులతో బిజీ బిజీగా ఉంటున్న ఉపాసనకు ఇప్పుడు మరో బాధ్యత రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×