Jagadekaveerudu Athilokasundadi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన హిట్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి.. ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అందరికీ తెలుసు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే స్టోరీ ఉండడంతో ఈ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. అయితే ఈ మధ్య పాత హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతూ సక్సెస్ అవుతున్నాయి. ఈ మధ్య టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి మళ్లీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. గతంలో ఈ సినిమాను రిలీజ్ చేసిన అదే డేట్ న మే 9న థియేటర్లలో ఈ సినిమా మరోసారి రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంచరణ్ ఏమన్నాడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాలలో జగదేకవీరుడు అతిలోకసుందరి కూడా ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి మే 9 కి సరిగా 35 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమాని మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నారు. ఒక సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయడమంటే అంత ఈజీ కాదు. ఇక ఈ మూవీ ఎవర్ గ్రీన్ అనేలా 8కే అప్డేట్ చేయించారు. ఆనాటి రీల్స్ ను ఈనాటి టెక్నాలజీకే కాదు.. రాబోయే మూడు నాలుగు దశాబ్దాల వరకూ ఏ ఇబ్బందీ లేకుండా అప్డేట్ చేయించారని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు.. ఈ మూవీ ఎపిక్ ను ఈ సారి త్రీడీలోనూ చూసేలా మార్చారు. మానస సరోవరాన్ని త్రీడీలో చూస్తే ఆ అనుభూతిని ఎలా వర్ణించగలం. ఓ రకంగా జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక ఏజ్ లెస్ మూవీ.. అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటుగా.. మెగా హీరోలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీపై రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ ఏమన్నారంటే..
చిరుకు రామ్ చరణ్ ప్రశ్నలు..
35 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి, రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లను సుమ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో చూస్తే మళ్లీ మానస సరోవరం సెట్ వేసి అందులో నిర్వహించినట్టు కనిపిస్తోంది. సుమ యాంకరింగ్ చేసిన ఈ ఇంటర్వ్యూ గురువారం విడుదల చేయబోతున్నారు.. రామ్ చరణ్ ఆన్ లైన్ వీడియోలో దర్శనమిచ్చారు. జగదేక వీరుడు క్లైమాక్స్ కోసం మాట్లాడారు. చివరిలో ఉంగరం దానిని మింగిన చేప ఏమయ్యాయి. దానికి సమాధానం ఒక్కరే చెప్పగలరు.. అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఆ ఒక్కరు ఎవరనేది మే 8న ఫుల్ వీడియోలో చెప్పనున్నారు. దీనిపై పార్ట్ 2 లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. తనకైతే ఈ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యి మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుంది.. మరి 35 ఏళ్ల క్రితం భారీ విజయనందుకు ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందో..? ఎంత వసూల్ చేస్తుందో చూడాలి..