BigTV English

Mega Family Reaction: ప్రతీసారి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు.. కొండా సురేఖపై మెగా ఫ్యామిలీ ఫైర్

Mega Family Reaction: ప్రతీసారి మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు.. కొండా సురేఖపై మెగా ఫ్యామిలీ ఫైర్

Mega Family Reaction On Konda Surekha Comments: నాగచైతన్య, సమంత విడాకులపై, అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాల్లోనే కాదు.. సినీ పరిశ్రమలో కూడా దుమారాన్ని రేపాయి. ఇప్పుడు వరుణ్ తేజ్, వెంకటేశ్, అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. అంతే కాకుండా ‘ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్, లావణ్య, అల్లు అర్జున్ దీనిపై స్పందించగా.. వెంకటేశ్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.


వెంకటేశ్

‘ఒక పర్సనల్ విషయాన్ని రాజకీయ స్వలాభాల కోసం ఉపయోగించడం చూస్తుంటే బాధేస్తోంది. బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులే ఇతరుల పర్సనల్ విషయాన్ని ఆయుధంగా వాడుకోవాలని అనుకోవడం దురదృష్టకరం. మేము చేసే వృత్తిపై, మా పర్సనల్ జీవితాలపై గౌరవంతో మా సినిమా ఫ్యామిలీ కట్టుబడి ఉంటుంది. సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ జీవితాలను బయటపెట్టినప్పుడు అందరి నుండి కొంచెం గౌరవాన్ని కోరుకుంటారు. ప్రైవేట్ జీవితాలను రాజకీయాల్లో లాగడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. పైగా అందులో భాగమయిన వారికి మరింత బాధను మిగులుస్తుంది. ఇలాంటి ముఖ్యమైన పదవుల్లో ఉండేవారు కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మన ఆలోచనలకు, మాటలకు చాలా బరువు ఉంటుంది. వాటిని ఒక మనిషిని బాధపెట్టడం కోసం కాకుండా ధైర్యం చెప్పడం కోసం ఉపయోగిస్తే బాగుంటుంది’ అంటూ తన స్టైల్‌లో స్పందించారు వెంకటేశ్.


వరుణ్ తేజ్

‘మంత్రి కొండా సురేఖ గారు చేసిన అనవసర, దురుసు వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయడం, ముఖ్యంగా ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడడం అస్సలు ఒప్పుకోదగినది కాదు. సినీ పరిశ్రమలో తరపున నేను కూడా ఇలాంటి ప్రవర్తనను అస్సలు అంగీకరించను. రాజకీయ స్వలాభాల కోసం ఫిల్మ్ సెలబ్రిటీలను, వారి కుటుంబాలను టార్గెట్‌లాగా మార్చుకోవడం ఆపాలి. మీరు ఇలాంటివాటిపై కాకుండా అభివృద్ధిపై ఫోకస్ పెడితే బాగుంటుంది’ అని ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘సినీ సెలబ్రిటీలపై, వారి కుటుంబాలపై చేసిన పరువు తక్కువ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖ్యలు అమర్యాదగా ఉండడంతో పాటు మన తెలుగు కల్చర్‌కు అతీతంగా కూడా ఉన్నాయి. ఇలాంటి బాధ్యత లేని ప్రవర్తనను ఎవరూ అంగీకరించకూడదు. ఎవరైతే ఈ విషయంలో భాగమయ్యారో వారు మరింత బాధ్యతో వ్యవహరిస్తూ అందరి ప్రైవసీని గౌరవించాలని, ముఖ్యంగా మహిళల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాను. మనం ఒక సమాజంగా గౌరవాన్ని వ్యాపించేలా చేయాలి’ అని అన్నాడు.

లావణ్య త్రిపాఠి

ఇక మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘చాలా కష్టకాలాన్ని దాటి వచ్చిన ఒక కుటుంబం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఒక మహిళే మరొక మహిళ గురించి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు. ప్రతీసారి యాక్టర్లు, వారి కుటుంబాలు ఎందుకు మీకు టార్గెట్ అవుతాయి? వారి పాయింట్ నిజమని చెప్పడం కోసం మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు విషయం మీద ఫోకస్ చేయండి’ అంటూ ఘాటుగానే స్పందించింది లావణ్య.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×