BigTV English

Nagarjuna Meets Mizoram Governor: గవర్నర్ ను కలిసిన నటుడు నాగార్జున.. సమంత విడాకులపై ఏమన్నారంటే

Nagarjuna Meets Mizoram Governor: గవర్నర్ ను కలిసిన నటుడు నాగార్జున.. సమంత విడాకులపై ఏమన్నారంటే

Nagarjuna Meets Mizoram Governor| టాలీవుడ్ సీనియర్ నటుడు కింగ్ నాగార్జున గురువారం మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుతో కలిశారు. కొన్ని రోజుల నుంచి గవర్నర్ హరిబాబు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించడానికి నాగార్జున వెళ్లారు. నటుడు నాగార్జునతోపాటు మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా గవర్నర్ హరిబాబుని పరామర్శించారు.


సెప్టెంబర్ 9న మిజోరం గవర్నర్ హరిబాబు అస్వస్థత కారణంగా హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్స్ చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ ఉందని ధృవీకరించారు. దీంతో ఆయను ఐసియులో ప్రత్యేక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గవర్నర్ హరిబాబు విశాఖపట్నంలో ఉన్నారని సమాచారం.  ఈ క్రమంలో నటుడు నాగార్జున, రాజకీయ నాయకుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వైజాగ్ వెళ్లి ఆయనను పరామర్శించారు.

Also Read: పాపులారిటీ కోసమే సెలబ్రిటీలను వాడుకుంటున్నారు – కొండా సురేఖపై మెగాస్టార్ ఫైర్..!


అయితే అక్కడ మీడియా ప్రతినిధులు నాగార్జునతో సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. కానీ నాగార్జున ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×