Raja Saab: పాన్ ఇండియా స్టార్‌గా ట్యాగ్ వచ్చిందంటే చాలు.. హీరోలు సినిమాలు చేయడంలో ఆటోమేటిక్‌గా స్పీడ్ తగ్గిపోతుంది. మంచి ఔట్‌పుట్ రావాలి, ఫ్యాన్స్ అందరూ తృప్తిపడేలా ఉండాలి.. ఇలా పలు కారణాలు చెప్తూ సినిమాలు చేయడంలో లేటు చేస్తుంటారు స్టార్ హీరోలు. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి అలాగే ఉంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేస్తున్నా అవి ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం సమయం పడుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన సినిమాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘రాజా సాబ్’. ఇప్పటికే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మరింత డిసప్పాయింటింగ్ న్యూస్ చెప్పాడు దర్శకుడు మారుతి.
క్లారిటీ వచ్చేసింది
మారుతి లాంటి దర్శకుడితో ‘రాజా సాబ్’ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ప్రభాస్ (Prabhas). ఇప్పటివరకు మారుతికి ఏ స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన అనుభవమే లేదు. అందుకే ప్రభాస్‌తో తన సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. కానీ గ్లింప్స్, పోస్టర్ల రూపంలో తను ఇచ్చిన ఔట్‌పుట్ చూసి షాక్ అవ్వడమే కాకుండా ‘రాజా సాబ్’పై అంచనాలు పెంచేసుకున్నారు. కానీ ప్రభాస్ మునుపటి సినిమాలకు జరిగినట్టుగానే ఇది కూడా వరుసగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అసలైతే 2025 జనవరిలో విడుదల కావాల్సిన ‘రాజా సాబ్’ ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో మారుతిపై ప్రెజర్ పెరిగిపోయింది. అందుకే తాజాగా ఈ మూవీ అప్డేట్స్‌పై ఒక క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.
నిర్మాణ సంస్థను అడగండి
‘రాజా సాబ్’ (Raja Saab) నుండి అప్డేట్ వచ్చి చాలాకాలమే అయ్యింది. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల అవుతుందని చెప్పినా అది అవ్వదని అర్థమయ్యింది. అయినా కూడా కనీసం విడుదల తేదీ వాయిదా పడిందనే విషయం కూడా చెప్పలేదు మేకర్స్. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. దానివల్లే అప్డేట్ ఇవ్వమని ట్విటర్‌లో మారుతికి తెగ మెసేజ్‌లు పెడుతున్నారు. అదంతా చూసి సహనం కోల్పోయిన మారుతి.. తాజాగా దీనిపై ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ షేర్ చేశాడు. ‘మీకు సరైన అప్డేట్ ఇవ్వడం కోసమే మా నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కష్టపడుతోంది’ అని చెప్పుకొచ్చాడు మారుతి (Maruthi).
Also Read: రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గని అమరన్.. అన్ని కోట్లా.?
షూటింగ్ మిగిలుంది
‘ప్రస్తుతం సీజీ పనులు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆ పని పూర్తయిపోతే రిలీజ్ డేట్ గురించి అనౌన్స్ చేస్తాం. ఎన్నో ఇతర విషయాలు కూడా కలిపితేనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక్క మనిషి చేసే పని కాదు. అందుకే అన్నింటికి సమయం పడుతుంది. కొంచెం ఓపికతో ఉండండి. మీ అంచనాలను అందుకోవడానికి అందరూ కష్టపడుతున్నారు. ఇంకా కొంచెం షూటింగ్ మాత్రమే మిగిలింది. ఎన్నో సీజీ స్టూడియోస్ మా సినిమాలో భాగమయ్యి ఉన్నాయి. ఇప్పటివరకు వారు ఇచ్చిన ఔట్‌పుట్ చాలా బాగుంది. సాంగ్స్ షూటింగ్స్ పూర్తయితే అవి కూడా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. మా కష్టం మీకు చూపించడానికి ఎదురుచూస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు మారుతి.
To give the accurate info @peoplemediafcy on that job
Expecting CG out put soon once those are verified makers will announce the release date , many external things will involve in this process, it's not a one man word or work so things will take time ,
Be Lil patient, every…— Director Maruthi (@DirectorMaruthi) April 8, 2025