BigTV English

Ram Pothineni: నిన్నుకోరి డైరెక్టర్ తో రామ్.. ఈ కాంబో భలే కొత్తగా ఉందే.. ?

Ram Pothineni: నిన్నుకోరి డైరెక్టర్ తో రామ్.. ఈ కాంబో భలే కొత్తగా ఉందే.. ?

Ram Pothineni: ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, గత కొన్నేళ్లుగా  ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు.  ఇస్మార్ట్ శంకర్ తరువాత రెడ్,  వారియర్, స్కంద అంటూ మూడు సినిమాలతో వచ్చాడు కానీ, ఏది వర్క్ అవుట్ కాలేదు. ఇక ఎన్నో ఆశలతో  డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడులా బాక్సాఫీస్ మీద యుద్ధం చేయడానికి  రెడీగా ఉన్నాడు.


 

ప్రస్తుతం రామ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి.  అందులో ఒకటి ఆంధ్రా కింగ్ తాలూకా.  రామ్ హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక  ఈ చిత్రంలో హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టైటిల్ టీజర్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో  సాగర్ అనే కాలేజ్ కుర్రాడి పాత్రలో రామ్ నటిస్తున్నాడు. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షశకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. టైటిల్ టీజర్  తరువాత ఆ హైప్ మరింత పెరిగింది. ఇక ఆంధ్రా కింగ్ తాలూకా కాకుండా రామ మరో సినిమానుపట్టాలెక్కించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.


 

నిన్నుకోరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమై మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న శివ నిర్వాణతో రామ్ జత కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మజిలీ, టక్ జగదీశ్ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న శివ నిర్వాణ.. 2023 లో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన  ఖుషీ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఖుషీ తర్వాత నుంచి ఒక మంచి స్క్రిప్ట్ రాసే. పనిలో పడ్డాడట శివ నిర్వాణ.

 

అందుతున్న సమాచారం ప్రకారం ఆ స్క్రిప్ట్ నే రామ్ కు వినిపించడం జరిగిందని తెలుస్తోంది. రామ్ కూడా శివ నిర్వాణ స్క్రిప్ట్ నచ్చడంతో ఓకే చెప్పినట్లు టాక్. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మించనున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా కూడా వారే నిర్మిస్తున్నారు. ఈ వార్తే కనుక నిజమైతే రామ్ కు చాలాకాలం తరువాత ఒక మంచి లవ్ స్టోరీ పడుతుందని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు రామ్ లవ్ స్టోరీస్ చాలా యూనిక్ గా ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో హీరోలు మాస్ హీరోగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తో ఉస్తాద్ లా మారిపోయాడు. ఆ తరువాత అదే మాస్ లుక్ ను మెయింటైన్ చేస్తూ సినిమాలు చేసాడు. కానీ, అంతగా ఫలితం లేకపోయింది. అందుకే ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో రామ్ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×