RCB Stampede: బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన కేసును.. కర్ణాటక ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సంఘటనకు కారణమైన అందరి పైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్ట్ చేసింది. తాజాగా ఈ సంఘటన వెనుక ఉన్న కీలక సూత్రధారిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు జీన స్వామి స్టేడియం తొక్కేసలాట కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే అరెస్ట్ కావడం జరిగింది.
Also Read: Vijay Mallya – SBI: విజయ్ మాల్యాను ర్యాగింగ్ చేసిన SBI.. రా నాన్న ఇండియాకు రా
ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది. ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడే రాయల్ చాలెంజెస్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే ను.. అరెస్టు చేశారు కర్ణాటక పోలీసులు. రాయల్ చాలెంజెస్ బెంగళూరు విక్టరీ పరేడ్కు సంబంధించి నిఖిల్ సోషలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని… కర్ణాటక పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అనుమతి లేకుండా నిర్వహించాలని పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ జయరాం పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏ క్షణమైనా వాళ్లను అరెస్టు చేసే ఛాన్స్ ఉంది.
ఒక్క టైటిల్ కోసం 11 మందిని చంపారు కదరా !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ టైటిల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైటిల్ గెలవడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర విజయోత్సవ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో మూడు లక్షల మంది ఒకే దగ్గరికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మొత్తం 11 మంది మృతి చెందారు. ఇతర ప్రాంతాల్లో మరో ఇద్దరు మరణించారు.
దాదాపు 33 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 10 మంది ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. మరణించిన కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అధికారికంగా ప్రకటించింది కర్ణాటక సర్కార్. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కుటుంబానికి ఐదు లక్షలు అలాగే గాయపడ్డ వారికి రెండు లక్షల చొప్పున ఇచ్చింది.
Also Read: Karnataka CM: RCBకి బిగ్ షాక్.. వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయండి.. సీఎం ఆదేశాలు
లండన్ పారిపోయిన విరాట్ కోహ్లీ!
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా 11 మంది మృతి చెందిన సంఘటన మరువక ముందే… లండన్ వెళ్లిపోయారు విరాట్ కోహ్లీ దంపతులు. ఈ సంఘటన జరిగి 18 గంటలు కూడా ముగియక ముందే తన భార్య అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ముంబై నుంచి లండన్ వెళ్లిపోయారు.
So this news was true about Chokli
MDC Chokli has literally no shame 🙏💔 pic.twitter.com/cx0Rfnl9X6— . (@Devx_07) June 5, 2025