BigTV English

Double Ismart Review: డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చిందా..ఇస్మార్ట్ రివ్యూ

Double Ismart Review: డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చిందా..ఇస్మార్ట్ రివ్యూ

Ram pothineni.. Puri jagannadh Combination Movie ‘Double ISmart’ Review: హీరో రామ్ పోతినేని , పూరీ జగన్నాథ్ ఇద్దరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఇద్దరికీ హిట్ సినిమాలు లేకపోవడం యాధృచ్ఛికమే. అయితే ఇద్దరికీ లైఫ్ అండ్ డెత్ గా ఈ సినిమాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే అమెరికాలో ఇప్పటికే ప్రీమీయర్ షోలు పడ్డాయి. ట్విట్టర్ వేదికగా ఈ సినిమా ఎలా ఉందో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ హిట్టా..ఫట్టా ఎలా ఉందనేది చూద్దాం..


పాత కథే కొత్తగా..

ఇస్మార్ట్ శంకర్ కథనే కాస్త అటూ ఇటూగా మార్చి తీశారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు హీరో రామ్ పోతినేని మాస్ అపియరెన్స్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. కల్కి మూవీ తర్వాత సరైన సినిమాలు లేక టాలీవుడ్ వెలవెల బోతున్న సమయంలో ఈ ఆగస్టు 15న ప్రేక్షకులను ఎంటర్ టైన్ చెయ్యడానికి పూరీ, రామ్ ఇద్దరూ డబుల్ డోస్ వినోదాన్ని పంచడానికి వచ్చారు. అయితే సినిమాలో ఎక్కడా పూరీ మార్కు కనిపించలేదని కొందరు అంటున్నారు. పైగా ఔట్ డేటెడ్ కథ అని అంటున్నారు. మెదడులో చిప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ టైప్ లోనే ఈ కథ కూడా నడుస్తుంది. విలన్ గా బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో సంజయ్ దత్ నటించారు. కానీ సంజయ్ దత్ ను పూరీ సరిగా వాడుకోలేదని కొందరు ట్విట్టర్ లో చెబుతున్నారు.


రామ్ మేనరిజమ్స్..

కొద్దో గొప్పో రామ్ హీరోయిజం సినిమాను సేవ్ చేసిందంటున్నారు. రామ్ మాస్ హీరోగా టైలర్ మేడ్ పాత్రలో మెప్పించాడని..అతని లుక్, మేరరిజమ్స్ బాగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు. ఇక మదర్ సెంటిమెంట్ కూడా బాగుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని సెకండాఫ్ ఎబోవ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. ఆలీ కామెడీ కూడా పూరీ గత చిత్రాల మాదిరిగా లేదని నిరాశపరిచిందని అంటున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయిందంటున్నారు. పాటలుకూడా మాస్ బీటులో సాగాయి. ఇప్పటికే మార్ ముంత చోడ్ చింత పాట పెద్ద రేంజ్ లో హిట్టయ్యంది. ఇక ఈ పాటలో రామ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడంటున్నారు.

సంజయ్ దత్ ఓకే..

విలన్ గా నటించిన సంజయ్ దత్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు మంచి గ్రిప్పింగ్ గా ఉన్నాయని అంటున్నారు. కాకపోతే కథ, కథనాల విషయంలో పూరీ జగన్నాథ్ తన మార్కు చూపించలేదని..పూరీ కథల మీద కాన్సన్ ట్రేషన్ చేస్తే మరింత బాగా అవుట్ పుట్ వచ్చేదని అంటున్నారు. హీరోయిన్ గా కావ్య థాపర్ తన అందాలను ఆరబోసిందని..హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కెమెస్ట్రీ యూత్ ను ఆకట్టుకునేలా ఉందని ట్విట్టర్ ద్వారా పోస్టింగులు పెడుతున్నారు. ఓవరాల్ గా ఆడియన్స్ ఇచ్చిన ట్విట్లర్ కథనాల ద్వారా ఇస్మార్ట్ శంకర్ ఎబోవ్ యావరేజ్ సనిమాగా నిలచింది. పక్కా మాస్ పైసా వసూల్ చిత్రం అని చెప్పుకోవచ్చు. రామ్ ఎనర్జిటిక్ నటన, పూరీ టేకింగ్స్ మెచ్చే అభిమానులకు మాత్రం ఈ మూవీ పక్కా ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×