Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్య ఈ యంగ్ హీరో ఖాతాలో చెప్పుకో తగ్గ సినిమాలు అయితే లేవు.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలిన సినిమాలు అన్ని యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. సినిమాలను పక్కన పెడితే రామ్ ను అందరు అమ్మాయిలు ముద్దుగా చాక్లేట్ బాయ్ అని అంటారు. అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిని కావాలని కోరుకుంటారు. అయితే ఇతను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. తాజాగా ఈయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
హీరో రామ్ పెళ్లి చేసుకోవడం ఈయన లేడీ ఫ్యాన్స్ కి కాస్త చేదు వార్త అయినప్పటికీ ఎంతో మందికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ పోతినేని పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే ఎంతోమంది ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లి గురించి గతంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. కానీ వాటి గురించి ఎప్పుడు రామ్ స్పందించలేదు. అప్పుడప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతున్నారు. ఇప్పుడు మరో వార్త నెట్టింట వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం ఓ రేంజు లో వైరల్ అవుతున్నాయి.. తాజాగా వినిపించే న్యూస్ మాత్రం రూమర్ కాదని, నిజంగానే రామ్ పోతినేని పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరని తెగ వెతికేస్తున్నారు ఫ్యాన్స్..
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే రామ్ పోతి నేని పెదనాన్న స్రవంతి రవి కిషోర్ తమ బంధువుల్లో ని ఒక మంచి అమ్మాయిని సెట్ చేసినట్లు తెలుస్తుంది. రామ్ పోతినేనికి తెలిసిన అమ్మాయే కావడం తో వీరిద్దరూ పెళ్ళికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే రామ్ చేసుకోబోయే అమ్మాయి బ్యాగ్రౌండ్ కూడా బాగానే ఉందని , కోట్ల ఆస్తులు అమ్మాయి పేరు మీద ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఆ అమ్మాయి తో కలిసి డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.. మరి ఈ పెళ్లి పై వస్తున్న వార్తల్లో నిజమేంత ఉందో? రామ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈయన లైఫ్ లో ఈ మధ్య హిట్ సినిమా అంటే ఇస్మార్ట్ శంకర్.. ఈ మూవీ తర్వాత వచ్చిన స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోని సినిమాలు చెయ్యనున్నాడని టాక్.. ఏ డైరెక్టర్ తో చేసిన ఈ సినిమా హిట్ అవ్వకుంటే మాత్రం ఇక అతని సినీ లైఫ్ ఖతం అవుతుందని ఇండస్ట్రీలో టాక్. మరి ఎలాంటి కథతో ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి..