Saraighat Express: సాధారణంగా ట్రైన్ స్టేషన్ కు వచ్చిందంటే 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆగదు. చిన్న చిన్న స్టేషన్లు అయితే రెండు నిమిషాలు ఆగడం కూడా ఎక్కువే. ప్యాసింజర్లు ఎక్కారా? లేదా అనేది డ్రైవర్ కు అవసరం లేదు. ఎవరు ఎక్కినా ఎక్కకపోయినా ట్రైన్ ముందుకు కదులుతుంది. కానీ కేవలం పెళ్లివారి కోసమే ట్రైన్ ను మూడు గంటల పాటూ ఆపేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన చంద్రశేఖర్ వాఘ్ అనే యువకుడికి అస్సాంలోని గుహవాటి అమ్మాయితో పెళ్లి కుదిరింది.
Also read: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే ప్రమాదమే..
చంద్రశేఖర్ ఈనెల 14న తన ముప్పై నాలుగు మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ముంబైలో బయలుదేరి 15 ఔరా చేరుకున్నాడు. అక్కడ నుండి గువాహటి వెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ చేసుకున్నారు. అక్కడ వారు ఎక్కాల్సిన గీతాంజలి ఎక్స్ ప్రెస్ మూడున్నర గంటలు ఆలస్యం అయింది. అప్పటికే ఆలస్యం అవ్వడంతో హౌరాలో వారు ఎక్కాల్సిన సరైఘట్ ఎక్స్ ప్రెస్ ను అందుకోలేమని, అదే జరిగితే సమయానికి గువాహటి చేరుకోలేమని భావించిన పెళ్లికొడుకు అత్యవసర సాయం కోసం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేశాఖకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టాడు.
అతడి ట్వీట్ కు స్పందించిన రైల్వేశాఖ అసౌకర్యానికి స్పందించి గీతాంజలి ఎక్స్ ప్రెస్ వచ్చేవరకు హౌరాలో సరైఘట్ ఎక్స్ ప్రెస్ ను నిలిపి ఉంచాలని అధికారులను ఆదేశించింది. చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో హౌరా చేరుకున్న తరవాతనే సరైఘట్ ఎక్స్ ప్రెస్ కదిలింది. దీంతో తన పెళ్లికి సమయానికి చేరుకునేలా సహరించినందుకు రైల్వేశాఖకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపాడు. చంద్రశేఖర్ కోసం రైల్వేశాఖ మంచిపనే చేసినా మిగితా మూడు వందల మందికి మాత్రం ఈ పనితో ఇబ్బంది కలిగింది. దీంతో వారంతా రైల్వే మంత్రిపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.