Beauty Products: ప్రతి మహిళ, అమ్మాయి చాలా అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అందంగా కనిపించేందుకు తరచుగా అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు కొంతకాలం పాటు మంచి రిజల్ట్ ఇచ్చినా కూడా తర్వాత మీ ఆరోగ్యం, చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. అందుకే కొన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండా ఉంటేనే మంచిది. వీటి ద్వారా లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. మరి వీటికి సంబంధించిన మరిన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం తెల్లబడటానికి క్రీమ్:
మన దేశంలో ఫెయిర్‌నెస్‌పై భిన్నమైన అభిమానం ఉంది. ముఖ్యంగా అమ్మాయి రంగు కాస్త నల్లగా ఉంటే ఇంటివాళ్లే కాదు ఇరుగుపొరుగు వాళ్లంతా ఫెయిర్‌గా మారేందుకు చిట్కాలు చెబుతుంటారు. పెద్ద కంపెనీలు ఫెయిర్‌నెస్‌పై మనకున్న అభిరుచిని సద్వినియోగం చేసుకొని అనేక స్కిన్ లైట్నింగ్ క్రీమ్‌లను మార్కెట్‌లో విడుదల చేశాయి. మీరు వాటిని ఉపయోగిస్తే కనక వాటిని ఈరోజే ఆపేయండి. ఎందుకంటే స్కిన్ లైటనింగ్ క్రీమ్‌లు ప్రమాదకరమైన బ్లీచింగ్ ఏజెంట్‌లను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని తక్కువ సమయంలోనే మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా వీటిని ఎక్కువ రోజులు వాడితే గనక మీ ముఖం మరింత అధ్వాన్నంగా మారుతుంది. రసాయనాలతో తయారు చేసిన ఫేస్ క్రీములు మూత్రపిండాలు, మెదడును కూడా ప్రభావితం చేస్తాయి.
జుట్టు రంగు:
మీరు కూడా మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా జుట్టు రంగును తరచుగా మారుస్తూ ఉంటే కనక తక్షణమే మానేయండి. ఎందుకుంటే మీరు హెయిర్ డైని ఎక్కువగా ఉపయోగిస్తుంటే.. మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి, హెయిర్ డైలు ప్రమాదకరమైన రసాయనాల ద్వారా తయారవుతాయి. ఇవి జుట్టు మరింత రాలడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అందుకే జుట్టుకు రంగు వేయడానికి హెన్నాతో పాటు ఉసిరి మొదలైన సహజమైన రంగులను ఉపయోగించండి.
పొడి షాంపూ:
ఈ రోజుల్లో డ్రై షాంపూ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. డ్రై షాంపూని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు హాని కలుగుతుంది. వాస్తవానికి పొడి షాంపూని ఉపయోగించడం వల్ల తలపై రంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణంగా రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. అందుకే రసాయనాలో తయారు చేసిన డై షాంపూలను వాడటం మానుకుంటే మంచిది.
Also Read: ఈ ఒక్కటి ముఖానికి వాడితే.. తెల్లగా మెరిసిపోతారు తెలుసా ?
హెయిర్ రిమూవల్ క్రీమ్:
శరీరంపై వెంట్రుకలను తొలగించడానికి సులభమైన , నొప్పి లేని మార్గం హెయిర్ రిమూవల్ క్రీమ్‌ను ఉపయోగించడం. మార్కెట్‌లో లభించే చాలా వరకు హెయిర్ రిమూవల్ క్రీమ్‌లు చాలా ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేయబడతాయి. ఇవి మీ శరీరానికి ఏమాత్రం మంచిది కాదు. ఇవి చర్మం నల్లబడటం, చికాకు, దురద వంటి సమస్యలను కలిగించడమే కాకుండా చర్మం ద్వారా చొచ్చుకొనిపోయి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే మంచి బ్రాండ్‌ను ఎంచుకోవడం మంచిది. లేకపోతే వాక్సింగ్ , షేవింగ్ వంటివి చేయడం మంచిది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.