E-Paper
Advertisement

Ramcharan: తారక్‌తో మళ్లీ డ్యాన్స్ చేయాలని ఉంది.. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం: రామ్‌చరణ్

Ramcharan: తారక్‌తో మళ్లీ డ్యాన్స్ చేయాలని ఉంది.. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం: రామ్‌చరణ్
Advertisement




Ramcharan: ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా నటుడు రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు సాంగ్‌కు మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేయాలని ఉందని తెలియజేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు రామ్ చరణ్.

‘‘ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ దక్కేలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం నాకు ఇంకా డ్రీమ్‌లానే ఉంది. రాజమౌళి, కీరవాణిలు భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన రత్నాలు. ఆర్ఆర్ఆర్ వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసినందకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Advertisement

నా సోదరుడు ఎన్టీఆర్, కోయాక్టర్ అలియాభట్‌కు ధన్యవాదాలు. తారక్‌తో కలిసి మళ్లీ నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆశపడుతున్నా. అలాగే నాటు నాటు సాంగ్ రచయిత చంద్రబోస్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్-కాలభైరవలకు, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌లకు ధన్యవాదాలు. ఈ అవార్డ్ ఆర్ఆర్ఆర్ టీమ్‌కే కాదు.. భారతీయ నటీనటులందరికీ సొంతం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినీఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడతున్నారు.

ఇక ఎన్టీఆర్ పులిబొమ్మ ఉన్న డ్రెస్సును ధరించి ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ ఓ రిపోర్టర్ ఆ డ్రెస్సు గురించి అడగగా.. ‘‘ఆర్ఆర్ఆర్‌లో నాతో కలిసి దూకిన పులి ఇదే.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ వస్త్రధారణలో వచ్చాను’’ అని సమాధానం ఇచ్చారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×