E-Paper
Advertisement

Rambha Car Accident : నటి రంభ కారు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Rambha Car Accident : నటి రంభ కారు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం..
Advertisement

Rambha Car Accident : ప్రముఖ నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నటి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ సోషల్‌మీడియా వేదికగా తెలియజేస్తూ.. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం రంభ కుటుంబం కెనడాలో ఉంటోంది.

సోమవారం సాయంత్రం రంభ.. తన పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకొని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తామంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు నటి తెలిపింది. అయితే తన చిన్న కుమార్తె సాషా మాత్రం గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని రంభ తెలిపింది. ప్రమాద సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలు, ఒక ఆయా కూడా ఉన్నారు. కారులో ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రమాదం గురించి నటి పోస్ట్ చేసిన ఫొటోలు చూడగానే అభిమానులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన రంభ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2010లో కెనడాలో స్థిరపడిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ప్రస్తుతం వీరి కుటుంబం ఒంటారియోలో నివాసముంటోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×