Game Changer First Half Review: గ్లోబల్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామని మెగా ఫాన్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. కోరిక ఇప్పటికి తీరింది. తమిళ స్టార్ డైరెక్టర్ లో వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు.. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇప్పటికి ఫస్ట్ హాఫ్ పూర్తయింది… మొదటి హాఫ్ లో సినిమా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
గేమ్ ఛేంజర్ మూవీ..
ట్రిపుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఇవాళ రిలీజ్ అయ్యింది. తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు. తెలంగాణలో ఈ మూవీకి బెనిఫిట్ షోలు లేవు. కేవలం టికెట్ ధరలను పెంచుకొనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. ఉదయం నాలుగు నుంచే మొదటి మొదలైంది. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ పూర్తి అయ్యింది. భారీ అంచనాలతో థియేటర్ కు వచ్చిన ఫ్యాన్స్ ను మూవీ ఎలా ఆకట్టుకుందో చూద్దాం..
ఫస్టాప్ ఎలా ఉందంటే..?
రామ్ చరణ్ యాక్షన్ తో బెస్ట్ పొలిటికల్ డ్రామాగా సినిమాను చూపించాడు. శంకర్ డైరెక్షన్, ఎస్‌జే సూర్య యాక్టింగ్, కియారా అద్వానీ మైమరించే పెర్ఫార్మెన్స్, బీజీఎం, ఆడియెన్స్ ఎక్సలెంట్ రెస్పాన్స్ అందించే సినిమా అని చెప్పాలి.. స్టిక్ట్‌గా ఫస్టాప్ యావరేజ్. కథలో ఊహించే సన్నివేశాలున్నాయి. అలాగే కమర్షియల్ మీటర్‌లో సినిమా వెళ్తున్నది. ఐఏఎస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్‌పై తీసిన కొన్నిసన్నివేశాలు చాలా బాగున్నాయి. రెండు చోట్ల చాలా స్టైలిష్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. లవ్ స్టోరీ బోరింగ్‌గా ఉంది. కామెడీ అంత బాగాలేదు. ఫస్ట్ హాఫ్ లో రెండు పాటలు వచ్చాయి. అందులో రా మచ్చా సాంగ్, దోప్ సాంగ్స్.. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తో తెరకేక్కించారు.. ఆ బడ్జెట్ అయితే కనిపిస్తుంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇప్పటివరకు హీరో యాక్టింగ్, తమన్ బీజీఎం ఇప్పటి వరకు మేజర్ అసెట్.. ఇంటర్వెల్ ట్విస్టు హైలెట్ అయ్యింది.. మొదటి హాఫ్ అయ్యేవరకు కాస్త బోరింగ్ అనిపించిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో స్టోరీని చూపించనున్నారు.. మొత్తం హైలెట్ సీన్స్ అంతా అందులోనే చూపించనున్నారు. టోటల్ సినిమా ఎలా ఉంటుందో కాసేపట్లో తెలియనుంది.. ఈ సినిమా రామ్ చరణ్ కు బ్లాక్ బాస్టర్ హిట్ ను ఇచ్చేలా ఉందని తెలుస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
ఫుల్ రివ్యూ & రేటింగ్ కోసం Bigtvlive.com ని ఫాలో అవ్వండి..