Ramcharan Statue: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ (Ram Charan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన, ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు. తర్వాత పలు చిత్రాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న రాంచరణ్.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఇక తనదైన మాస్ యాక్టింగ్, డాన్స్ తో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈయనకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అరుదైన గౌరవం లభించబోతున్న విషయం తెలిసిందే. అటు రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ డాగ్ రైమ్ కి కూడా ఈ గౌరవం లభిస్తోంది. ఇకపోతే ఈ మైనపు విగ్రహాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూడగా.. ఇప్పుడు ఆ ఎదురు చూపుకు తెరపడింది అని చెప్పవచ్చు.
మైనపు విగ్రహ ఆవిష్కరణ ఆరోజే..
ఇక రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని మే తొమ్మిదవ తేదీన లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో లాంఛ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియం కి తరలిస్తారు. ఇక చరణ్ కి దక్కిన ఈ అరుదైన గౌరవంతో అభిమానులతో పాటు వరల్డ్ వైడ్గా సినీ ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశానికి చెందిన ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) విగ్రహాలను టుస్సాడ్స్ లో ఏర్పాటు చేశారు. ‘బాహుబలి’ మూవీ నుంచి ప్రభాస్ రోల్ ను పోలి ఉండేలా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో గౌరవం, గర్వంగా భావించే ఈ జాబితాలో ఇప్పుడు రామ్ చరణ్ పేరు కూడా చేరిపోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రామ్ చరణ్ సినిమాలు..
రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar ) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బొక్క బోర్ల పడింది. ఇక ఈసారి ఎలాగైనా సరే మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్న రామ్ చరణ్.. ‘ఉప్పెన’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో రామ్ చరణ్ తన సినిమాని చేయబోతున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా వచ్చే యేడాది మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. మరి రామ్ చరణ్ తన డ్రీమ్స్ ను ఈ సినిమాతో ఫుల్ ఫిల్ చేసుకుంటారేమో చూడాలి.
ALSO READ:Director Geeta Krishna: కీరవాణిపై పోక్సో కేస్.. డైరెక్టర్ సంచలన కామెంట్..!