Director Geeta Krishna:దివంగత సంగీత దర్శకులు, ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Bala Subrahmanyam)1996లో ప్రారంభించిన కార్యక్రమం ‘పాడుతా తీయగా’..ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. అలా దాదాపుగా 25 సంవత్సరాలుగా ప్రేక్షకులను నిర్విరామంగా అలరిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆయన వారసుడు ఎస్పీ చరణ్ (SP Charan) హోస్టుగా వ్యవహరిస్తూ కొనసాగిస్తున్నారు. ఇకపోతే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే కార్యక్రమంలో ఒకప్పుడు చైల్డ్ సింగర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రవస్తి (Pravasthi) కి ఇప్పుడు 19 సంవత్సరాలు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి వారే తనను ఆహ్వానించారని, కానీ ఇప్పుడు సడన్గా పక్షపాతం చూపించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహిత ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) తో పాటు ప్రముఖ సింగర్ సునీత (Singer Sunitha)పై ఆరోపణలు చేస్తోంది. తనను చాలా అసభ్యకరంగా మాట్లాడారని, తన తల్లిని అవమానించారని, బొడ్డు కిందకు చీర కట్టుకొని రమ్మన్నారంటూ అటు పాడుతా తీయగా ప్రొడక్షన్ టీం పై కూడా కామెంట్లు చేసింది ప్రవస్తి.
కీరవాణిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలి – డైరెక్టర్ గీతాకృష్ణ
ఈ వివాదం రోజురోజుకు ముదురుతున్న వేళ సడన్గా డైరెక్టర్ గీతాకృష్ణ (Geeta Krishna) ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చి, ఎం ఎం కీరవాణిని పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలి అంటూ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో సింగర్ ప్రవస్తికి గీతాకృష్ణ మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పై సంచలన కామెంట్లు చేస్తూ..” కీరవాణి ఒక వ్యభిచారి. వాడు నాకు గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుసు. అంతకంటే ముందే 40 ఏళ్లుగా అతడి వేషాలు తెలుసు. తెలిసినా కూడా నాకెందుకులే అని చెప్పలేదు. నేనే కాదు అతడి గురించి తెలిసిన చాలా మంది అతడి గురించి నాతోనే డైరెక్ట్ గా చెప్పారు. అతనిపై దుమ్మెత్తి పోయాల్సిన అవసరం నాకేంటి అని సైలెంట్ గా ఉన్నాను. ఇటీవల వాడు పెద్దోడైపోయాడు. ఇక నాతో కూడా మాట్లాడటం మానేశాడు. ఒక కార్యక్రమానికి అమ్మాయిలను సెలెక్ట్ చేసే సమయంలో ఎక్కువగా స్కూల్ గర్ల్స్ మాత్రమే కావాలని అడిగేవాడు అంట. అతనిపై ఖచ్చితంగా పోక్సో కేసు పెట్టాలి” అంటూ సంచలన కామెంట్లు చేశారు గీతాకృష్ణ. టెలివిజన్ రంగం అనేది గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తించుకోవాలి అని కూడా గీతాకృష్ణ కామెంట్లు చేశారు. ఇక గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
కీరవాణి కెరియర్..
ఇక ఎం.ఎం.కీరవాణి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగుకు అందించిన మ్యూజిక్ ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు. అంతేకాదు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29) సినిమాకి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సంగీతం సమకూర్చే పనిలో పడ్డారు. ఇంతలోపే ఇలా ప్రవస్థి ద్వారా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. మరి ఈ విషయం కీరవాణి వరకు వెళ్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.