Kaushal Manda : తెలుగు బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో.. టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్.. ఈ షో ద్వారా ఎంతోమంది స్టార్ ఇమేజ్ ని అందుకున్నారు. మరి కొంతమంది అవకాశాలు రాకపోవడంతో తమ సినీ కెరీర్ కు పులు స్టాప్ పెట్టేశారు. అలాంటి వారిలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మండా కూడా ఉన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కౌశల్ వచ్చిన సీజన్ కు మంచి క్రేజ్ వచ్చింది. కౌశల్ ఆర్మీ అంటూ అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అయితే కౌశల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా స్క్రీన్ మీద కనిపించినట్లు లేదు. పలు టీవీ షోలలో మాత్రమే కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ ను బయట పెట్టారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఆ ఘటన ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
బిగ్ బాస్ విన్నర్ కౌశల్..
కౌశల్ మండ.. ఈరోజు పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలు సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యారు.. మల్టీ టాస్కర్‌గా నాకు ఇండివుడ్ అవార్డు వచ్చింది. ఇండియాలోని మల్టీ టాస్కర్స్‌లో నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దక్షిణాదిలో 82 రెండు చిత్రాలు. 1003 కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్. 520 ర్యాంప్ షోలు, ఫ్యాషన్ కోరియోగ్రాఫర్‌గా 250 షో నిర్వహించారు.. ఇప్పటికీ ఆయన పేరు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అప్పటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసే నటుడిగానే చాలా మందికి తెలుసు. కాకపోతే కౌశల్ బిగ్‌బాస్ ఇంట్లోకి రావడానికి ముందు కెరీర్‌లో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. వాటన్నిటిలో జయం సాధించినా.. లో ప్రొఫైల్‌లోనే మెయింటెన్ చేశారు. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ ప్రేక్షకులను ఆకర్షించాయి.. ప్రస్తుతం ఈయన బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో తన కెరీర్ ను నాశనం చేసిన సినిమా గురించి బయట పెట్టాడు. ఆ సినిమా ఏంటి ఎందుకు ఆ సినిమాను చేశాడో అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..
Also Read :స్మగ్లింగ్ కేసులో నటికి బిగ్ షాక్..జైలుకు వెళ్లాల్సిందే..!
ఆ సినిమా నా జీవితాన్ని నాశనం చేసింది..
సినీ నటుడు కౌశల్ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. హీరోలకు ఫ్రెండ్ గా పలు సినిమాలు చేసిన ఈయన ఓ ఆడల్డ్ సినిమా చేశాడన్న విషయం చాలామందికి తెలియదు.. తాజాగా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టాడు. డబ్బులు అవసరం ఉంటే నేను ఓ అడల్డ్ సినిమాకి ఒప్పుకున్నాను.. ఆ సినిమాలో ఎయిడ్స్ గురించి అవగాహన ఇచ్చారు. అని చాలామంది దాన్ని తప్పుగా తీసుకున్నారు. దాంతో అది అడల్డ్ సినిమా అయ్యింది.. దానికి నా రెమ్యూనరేషన్ 50,000.. అప్పుడు మా అమ్మ హెల్త్ బాగోలేదు ఆమె కోసం ఆ సినిమా చేశాను. అప్పటి నుంచి అందరు నన్ను తప్పుగా అనుకున్నారు. ఆ తర్వాత చక్రవాకం సీరియల్ చేశాను.. అప్పటివరకు నన్ను తప్పుగా అనుకున్న వాళ్ళందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నేను పూర్తిగా సైలెంట్ అయిపోయాను అని కౌశల్ అన్నాడు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు పాజిటివ్ నేటిజెన్లు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు..