Beetroot Face Mask: ఎండలు మండి పోతున్నాయి. ఈ ఉరుకు పరుగుల జీవితంలో తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిందే.. సూర్యరశ్మి నుండి పడే యూవీ కిరణాల వల్ల చర్మం కమిలిపోవడం, నల్లగా మారడం, ముఖంపై ట్యాన్ ఏర్పడటం, మచ్చలు, మొటిమలు వచ్చేస్తుంటాయి. ఇందుకోసం వేలవేలకు ఖర్చు చేసి బయట మార్కెట్లో క్రీములు, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి బయటకు వెళ్లే టైమ్ కూడా ఉండకపోవచ్చు.. పైగా.. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటారు కాబట్టి.. చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇందుకోసం నాచురల్‌గా మన ఇంట్లోనే దొరికే వాటితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఇందుకు బీట్‌రూట్ చక్కగా పనిచేస్తుంది. బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో.. చర్మ సౌందర్యానికి కూడా అంతే మంచిది. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్లు, ఫోలీక్ యాసిడ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి బీట్‌రూట్‌తో ఈ ఫేస్ ప్యాక్‌లు చేయండి.. రెండు రోజుల్లోనే మంచి రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌లు తయారీ..
బీట్‌రూట్, రోజ్‌వాటర్ ఫేస్ మాస్క్
ముందుగా మిక్సీజార్ తీసుకుని అందులో బీట్ రూట్ ముక్కలు వేసి.. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరె గిన్నెలోకి వడకట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. కాటన్ బాల్ సహాయంతో ముఖంపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.
ప్రయోజనాలు: ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే.. ముఖంపై మురికిని తొలగించి సహజమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది. నిమ్మ రసం మచ్చలను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని సున్నితంగా, మృదువుగా ఉండేలా చూస్తుంది.
బీట్‌రూట్, అలోవెరాజెల్ ఫేస్ మాస్క్
ముందుగా బీట్‌రూట్ మెత్తగా మిక్సీ పట్టుకుని.. వేరెగిన్నెలోకి వడకట్టుకోండి. అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరాజెల్ కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని 10-12 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రయోజనాలు: అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది.
బీట్‌రూట్, బాదం పౌడర్ ఫేస్ మాస్క్
చిన్నగిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ బీట్‌రూట్ రసం, టేబుల్ స్పూన్ బాదం పౌడర్, టేబుల్ స్పూన్ పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మసాజ్ చేస్తూ రాయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రయోజనం: బాదం పౌడర్ చర్మం మలినాలను తొలగించి, చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. బీట్‌రూట్ చర్మానికి పోషణను అందించి.. కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
Also Read: నాన్ వెజ్ ఇష్టంగా తింటున్నారా ? క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త
బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌ల ప్రత్యేకతలు:
సహజమైన కాంతి: బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేసి, సహజమైన గ్లోను అందిస్తాయి.
మొటిమల నివారణ: దీనిలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలు, తొలగించి ముఖం మిల మిల మెరిసేలా చేస్తుంది.
వృద్ధాప్య ఛాయలు తగ్గింపు: బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలను నివారించడంలో తోడ్పడుతుంది.
రక్తప్రసరణ మెరుగుదల: చర్మానికి సహజమైన కాంతిని, రంగును అందించడంలో అద్భుతంగా చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.