E-Paper
Advertisement

Ramcharan : రామ్ చరణ్ పై ఉపాసన రివెంజ్ .. వీడియో వైరల్..

Ramcharan : రామ్ చరణ్ పై ఉపాసన రివెంజ్ .. వీడియో వైరల్..
Advertisement

Ramcharan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఇష్టాలు, అభిరుచులను నెటిజన్లతో పంచుకుంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటారు. సంతోషమైనా, విషాదమైనా ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల తన నానమ్మ చనిపోయిన విషయాన్ని ఆమే వెల్లడించారు. ఆమెతో ఉన్న బంధాన్ని చెప్పుకొచ్చారు. అలాగే తను విదేశాలకు వెళ్లినా ఆ విశేషాలను షేర్ చేస్తారు. ఇప్పుడు ఓ ఆసక్తికర వీడియోను ఇన్ స్టా స్టోరీలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

కొన్నాళ్ల క్రితం అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. రామ్‌ చరణ్, ఉపాసన, సాయి ధరమ్‌ తేజ్ ఓకే సోఫాలో కూర్చొన్నారు. ఆ సమయంలో సోఫా కాస్త ఇరుకుగా ఉంది. దీంతో ఆ విషయాన్ని ఉపాసనకు రామ్ చరణ్ చెవిలో చెప్పాడు.‌ వెంటనే ఆమె లేచి పక్క సీటులోకి వెళ్లారు. ఆ సమయంలో రామ్ చరణ్ , సాయి ధరమ్ తేజ్ సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Advertisement

తాజాగా ఆ వీడియోకు మరో వీడియోను జత చేసి ఓ వ్యక్తి ఎడిటింగ్ తో ఆసక్తికరంగా మార్చాడు. అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో జరిగిన సీన్‌ తర్వాత చెర్రీ ఇంటికి వెళ్లాక పరిస్థితి ఎలా ఉంటుందో సరదాగా చూపించాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రామ్ చరణ్‌ ఇంటి పనులు చేసిన వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోను సోఫా ఎపిసోడ్ వీడియోకు అటాచ్‌ చేసి ‘‘ఉపాసన మేడమ్‌ రివెంజ్‌’’ అని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఉపాసన కంట పడింది. దీంతో ఆమె కూడా ఇన్‌స్టా స్టోరీల్లో దాన్ని షేర్‌ చేస్తూ స్మైలీ ఎమోజీలను జత చేశారు. ఇది అసలు కథ. ఈ విధంగా ఉపాసన..చెర్రీపై ప్రతికారం తీర్చుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×