BigTV English

Ramya Krishna: అందుకే బాలీవుడ్ కి దూరం.. సంచలన కామెంట్లు చేసిన శివగామి..!

Ramya Krishna: అందుకే బాలీవుడ్ కి దూరం.. సంచలన కామెంట్లు చేసిన శివగామి..!

Ramya Krishna.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రేక్షకులను ఆకట్టుకున్న రమ్యకృష్ణ (Ramya Krishna), టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించింది. ఇక స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే నరసింహా వంటి చిత్రాలలో నీలాంబరి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ పోషించి, హీరోలతో సమానంగా పారితోషకం అందుకుంది. అప్పట్లో విలన్ పాత్రకైనా , హీరోయిన్ పాత్ర కైనా ఏకైక ఛాయస్ గా మిగిలింది రమ్యకృష్ణ. ఇకపోతే 2015లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2017లో ఈ సినిమా సీక్వెల్ బాహుబలి 2 వచ్చి సినిమా చరిత్రను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.1788 కోట్లు వసూలు చేసి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఎంత పేరైతే అందుకున్నారో శివగామి దేవిగా రమ్యకృష్ణ కూడా అంతే పేరు దక్కించుకుంది.


సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే క్రేజ్..

సెకండ్ ఇన్నింగ్స్ లో బాహుబలి సినిమాతో మొదలుపెట్టిన రమ్యకృష్ణ, ఈ సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ తో ఈమెకు మరిన్ని సినిమాలలో అవకాశాలు లభించేలా చేసింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది రమ్యకృష్ణ. ఇదిలా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టకు ముందు సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించింది. అయితే కొంతకాలం తర్వాత బాలీవుడ్ కి కూడా దూరమైంది. మరి బాలీవుడ్ కి దూరమై టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఈమె.. ఎందుకు బాలీవుడ్ కి దూరమైందంటూ అభిమానులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.


రమ్యకృష్ణ సినిమా కెరియర్..

ఇకపోతే 1983లో వెళ్ళై మనసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది రమ్యకృష్ణ. ఇది తమిళ సినిమా అయినా ఆ తర్వాత భలే మిత్రులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అలా మలయాళం కన్నడ భాషల్లో కూడా నటించిన ఈమె 1988లో తొలి హిందీ సినిమా చేసింది. ఫిరోజ్ ఖాన్ , రాజేష్ కన్నా, అమ్రిష్ పూరి నటించిన దయావాన్ అనే చిత్రంలో రమ్యకృష్ణ నటించి, బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత షారుక్ ఖాన్ చాహత్ అనే సినిమాలో కూడా నటించింది.

బాలీవుడ్ లో అందుకే నటించలేదు..

Ramya Krishna: That's why Sivagami, who made sensational comments, distanced himself from Bollywood..!
Ramya Krishna: That’s why Sivagami, who made sensational comments, distanced himself from Bollywood..!

ఆ తర్వాతే అనుకోకుండా హిందీ పరిశ్రమకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయంపై మాట్లాడుతూ.. హిందీలో నేను చేసిన సినిమాలేవి కూడా పెద్దగా ఆడలేదు. అయితే అప్పటికే తెలుగులో నేను స్టార్ గా మారిపోయాను. తెలుగు సినిమాని వదిలి బాలీవుడ్ లో రిస్కు ఎందుకు చేయాలనుకుని అనుకున్నాను. అందుకే ఏ ఇండస్ట్రీలో అయినా సరే సక్సెస్ఫుల్ అవ్వడమే ముఖ్యం.. తెలుగులో సక్సెస్ అయ్యాను అందుకే అక్కడ హాయిగా సినిమాలు చేసుకుంటున్నాను అంటూ తెలిపింది రమ్యకృష్ణ. మొత్తానికి అయితే బాలీవుడ్ లో సినిమాలు డిజాస్టర్ గా మిగలడం వల్లే మళ్లీ ఆ వైపు అడుగులు వేయలేదని తెలిపింది రమ్యకృష్ణ.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×