BigTV English

Sampoornesh Babu : సంపూర్ణేశ్ బాబు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా?

Sampoornesh Babu : సంపూర్ణేశ్ బాబు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా?

Sampoornesh Babu : సినీ ఇండస్ట్రీలో అవకాశాలు పౌర్ణమి, అమావాస్య లాంటివి.. ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు గుడ్ బై చెప్పేస్తారో చెప్పడం కష్టం. అందుకే ఇప్పటి సెలెబ్రేటీలు క్రేజ్ ఉండగానే బాగా సంపాదించుకుంటున్నారు. కొందరు ఏమో రెండు మూడు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అలాంటి వారిలో కమెడియన్, హీరో సంపూర్ణేశ్ బాబు ఒకరు. ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ మధ్య ఆయన ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చెయ్యలేదు. అంటే సినిమాలకు దూరం అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంపూ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి అతనే కారణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


విభిన్నమైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించిన హీరో సంపూర్ణేష్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మాణ సంస్థలో హృదయ కాలేయం సినిమా ద్వారా సంపూర్ణేష్ బాబు మొదటిసారి హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా ఊహలకు అందని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ఆ జోష్ లోనే మరో రెండు సినిమాలను ప్రకటించాడు. వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి భారీ సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

సంపూ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి నిర్మాత కారణమా?


సంపూ హృదయ కాలేయం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా కామెడీ కథతో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది. ఆతర్వాత కొబ్బరి మట్ట అనే సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా కామెడీగా నవ్వించేసింది. ఆ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ఆ తర్వాత సంపూ బిజీ అవుతాడని అనుకున్నారు. కానీ మరో సినిమాను అనౌన్స్ చేసి సైడ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇక చివరిసారిగా మార్టిన్ లూథర్ కింగ్ అనే చిత్రంలో మాత్రమే. ఆ తర్వాత మళ్లీ ఎక్కడ సంపూర్ణేష్ బాబు కనిపించడం లేదు..

the reason of Sampoornesh Babu's distance from the industry?
the reason of Sampoornesh Babu’s distance from the industry?

సంపూ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి నిర్మాత సాయి రాజేష్ కారణం అని ఓ వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది. సినిమాకు కలెక్షన్స్ బాగా వచ్చినా కూడా సంపూ కు సరిగ్గా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని టాక్.. ఆ బాధతోనే సంపూ సినిమాలకు దూరంగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం తన సొంత ఊరిలో పొలం పనులు చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారట. ఆ పనిలో వచ్చిన డబ్బులతో కొన్ని సేవ కార్యక్రమాలు కూడ చేస్తున్నట్లు సమాచారం. హీరో అయినప్పటికీ కూడ సాధారణ వ్యక్తుల జీవితాన్ని బతికేస్తున్నాడట.. మళ్లీ సినిమాల్లోకి వస్తాడా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సంపూను తెలుగు ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారని సోషల్ మీడియాలో ఓ రేంజులో వినిపిస్తున్నాయి.. దీనిపై సంపూ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×