Manchu Vishnu: టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీ డెవలప్ అవ్వడం అనేది సంతోషకరమైన విషయమే కానీ వాటి వలన మనుషుల మధ్య దూరం కూడా కొంతమేరకు పెరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే టెక్నాలజీ అనే దానిని ఎలా యూస్ చేయాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. పదిమంది కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ పట్టుకుంటున్న దాఖలాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. పదిమంది కలిసి మాట్లాడుతున్నప్పుడు కాసేపు కూడా ఫోన్ ని పక్కన పెట్టరు కొంతమంది. అయితే చాలామంది వాట్సప్ యాప్ ను ఎంతగా యూస్ చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ యాప్ ను సెలబ్రిటీలు కూడా విచ్చలవిడిగా వాడుతారు.
గ్రూప్ నుంచి విడిపోయిన విష్ణు
ఏదైనా ఒక కొత్త యాప్ వచ్చినప్పుడు దానిమీద మోజు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది కూడా మామూలు అయిపోతుంది. అలా వాట్సప్ వచ్చిన కొత్తల్లో చాలామంది గ్రూప్స్ క్రియేట్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దగ్గుబాటి రానా, అల్లు అర్జున్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అయితే ఆ వాట్స్అప్ గ్రూప్ నుంచి మంచు విష్ణు బయటకు వచ్చేసారు. తాజాగా దాని గురించి మంచి విష్ణు మాట్లాడుతూ.. ” రానా బన్నీ ఆ గ్రూప్ క్రియేట్ చేశారు. దాంట్లో చాలా నాన్సెన్స్ ఎక్కువైపోయింది. ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయమని చెప్పాను. అంతేకాకుండా చాలామంది అమ్మాయిలు కూడా దానిలో ఉండేవాళ్ళు. అందుకే గురించే నేను ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చేసాను అంటూ తెలిపాడు.
నాని మాట్లాడిన గ్రూప్ కూడా ఇదేనా.?
గతంలో నాని మాట్లాడుతూ ఆ గ్రూపులో ఎవరెవరున్నారు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ గ్రూపు ఇప్పుడు యాక్టివ్ గా లేదు అని హిట్ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూస్ లో తెలిపారు. మరోసారి ఆ గ్రూప్ విషయం ఇప్పుడు కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తావనకు వచ్చింది. ఏదేమైనా చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అప్పుడు ఉన్నంత ఫ్రీగా ఇప్పుడు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే సంవత్సరానికి రెండు సినిమాలు చేసే తీరిక కూడా వాళ్లకు లేకుండా పోయింది. ప్రస్తుతం అంతా పోటీ ప్రపంచం, తమ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాలి అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని హీరోలంతా కూడా విపరీతంగా కష్టపడుతున్నారు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ కూడా అంచనాలను పెంచింది.
Also Read : Phanindra Narsetti: ఇంతమంది ట్రోలింగ్ కు సినిమాతో సమాధానం చెబుతాడా.?