BigTV English

Phanindra Narsetti: ఇంతమంది ట్రోలింగ్ కు సినిమాతో సమాధానం చెబుతాడా.?

Phanindra Narsetti: ఇంతమంది ట్రోలింగ్ కు సినిమాతో సమాధానం చెబుతాడా.?

Phanindra Narsetti: బ్యాక్ స్పేస్ అని ఒక షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు ఫణీంద్ర. ఆ తర్వాత ఫణీంద్ర చేసిన మధురం షార్ట్ ఫిలిం అద్భుతమైన హిట్ అయింది. ఆ షార్ట్ ఫిలింతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నాడు. ముఖ్యంగా ఆ షార్ట్ ఫిలిమ్స్ లో డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేవలం షార్ట్ ఫిలిమ్స్ లో మాత్రమే కాకుండా ఫణీంద్ర బయట మాట్లాడిన కూడా వినాలనిపించేలా ఉంటుంది తన భాష. మను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఫణి. ఈ సినిమా ఊహించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ ను సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంది.


రిలీజ్ కు రెడీ

ప్రస్తుతం ఫణి మైత్రి మూవీ మేకర్స్ లో 8 వసంతాలు అనే ఒక సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనంతిక హీరోయిన్ గా కనిపించనుంది. శుద్ధి అయోధ్య అనే పాత్రలో అనంతిక ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఫణీంద్ర సినిమాల్లో ఆడవాళ్లకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. కథా వస్తువుగా కొన్నిసార్లు ఆడవాళ్లను కూడా తీసుకొని చాలా గౌరవంగా చూపించటం అనేది షార్ట్ ఫిలిం అప్పటినుంచి ఫణి చేస్తున్నారు. ఇక ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. హృదయం సినిమాతో సంగీత దర్శకుడుగా మలయాళం లో మంచి పేరు సాధించుకొని ఆ తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలుకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు అబ్దుల్. సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది


సినిమాతో సమాధానం చెప్తాడా.?

మామూలుగా బయట ఎక్కువగా కనిపించడు ఫణి. చాలామంది అప్పట్లో ఇంటర్వ్యూస్ కోసం కూడా అడిగారు కానీ ఎవరికీ పెద్దగా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం తన సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది కాబట్టి ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మణిరత్నం సినిమాని ఈరోజు కామెంట్ చేస్తున్నారు. వాళ్లకు కామెంట్ చేయటానికి ఏమి అర్హత ఉంది అని అడిగాడు. అక్కడితో ఫణీంద్ర మీద ట్రోలింగ్ మొదలైంది. అర్హత స్టార్ అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక తాజాగా తాను అనుకుంటే కమర్షియల్ సినిమా తీయగలను అని 8 వసంతాలు ఈవెంట్ లో తెలిపిన మాటలకు మళ్లీ ట్రోల్ జరుగుతుంది. గతంలో వెంకటేష్ మహా కూడా ఇలానే కేజిఎఫ్ విషయంలో మాట్లాడారు. ఇప్పుడు ఫణీంద్ర ను కంపేర్ చేస్తూ, ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే వీటన్నిటికీ కూడా సినిమా తోనే సమాధానం చెప్పాల్సి ఉంది. పొరపాటున 8 వసంతాలు సినిమా ఆకట్టుకోకపోతే, ఇంక చాలామంది విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెడతారు.

Also Read : Genelia : హీరోయిన్స్ పై సౌత్‌ చిన్నచూపు.. యాంకర్‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×