BigTV English

Rana Controversy : రూ. 18 కోట్ల స్థ‌ల వివాదం.. సురేష్ బాబు, రానాల‌పై పోలీస్ కేసు

Rana Controversy : రూ. 18 కోట్ల స్థ‌ల వివాదం.. సురేష్ బాబు, రానాల‌పై పోలీస్ కేసు

Rana Controversy : కొన్నాళ్లుగా హైద‌రాబాద్ ఫిల్మ్ న‌గ‌ర్‌లో జ‌ర‌గుతున్న భూవివాద కేసుకి సంబంధించి నాంప‌ల్లి కోర్టు కీల‌క‌మైన తీర్పునిచ్చింది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు, హీరో రానాల‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది. అస‌లు వివాదం ఏంటి? నాంప‌ల్లి కోర్టు వారిపై ఎందుకు కేసు ఫైల్ చేయాల‌ని ఆర్డర్స్ వేసింద‌నే వివ‌రాలు కావాలంటే కాస్త వెన‌క్కి వెళ్లాల్సిందే. 2014లో ఫిల్మ్ నగర్‌లోని ప్లాట్ నెంబ‌ర్ 2లోని వెయ్యి గ‌జాల స్థ‌లాన్ని సురేష్ బాబు కొన్నారు. అయితే అంత‌కు ముందే ప‌క్క‌నే ఉన్న ప్లాట్ నెంబ‌ర్ 3లో స్థ‌లాన్ని ప్ర‌మోద్ అనే వ్యాపారికి లీజుకి ఇచ్చారు.


2018లో లీజు ముగుస్తున్న స‌మ‌యంలో సురేష్ బాబు త‌న వెయ్యి గ‌జాల స్థ‌లాన్ని అమ్మాలనుకుని రూ.18 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ప్రమోద్ రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే అంతకు ముందే లీజు పరిమితి ముగిసినా స్థలం నుంచి ఖాళీ చేయ‌టం లేదంటూ ప్ర‌మోద్‌పై సురేష్ బాబు కేసు వేసి ఉన్నారు. అయితే అగ్రిమెంట్ ప్ర‌కారం త‌న‌కు స్థ‌లం అమ్మ‌టం లేద‌ని ప్ర‌మోద్ కోర్టులో కేసు వేశారు. ఇలా ఈ స్థ‌ల వివాదంపై ఇప్ప‌టికే ఐదు కేసులు న‌డుస్తుండ‌గా హీరో రానాకు సురేష్ బాబు స్థ‌లాన్ని అమ్మేశారు.

అంతే కాకుండా గ‌త ఏడాది నంబ‌ర్ 1న కొంత మంది వ‌చ్చి ప్ర‌మోద్ లీజుకున్న స్థ‌లంలో సెక్యూరిటీని త‌రిమివేసి గొడ‌వ చేశారు. దీంతో ప్ర‌మోద్ కుమార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి ఫ‌లితం లేక‌పోవ‌టంతో ఆయ‌న ప్రైవేటుగా నాంప‌ల్లి కోర్టులో కేసు వేశారు. కేసుని ప‌రిశీలించిన కోర్టు సురేష్ బాబు, రానాల‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీస్ వారికి సూచ‌న‌లు చేసింది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×