Rana Daggubati..రానా దగ్గుబాటి(Rana Daggubati) ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. దగ్గుబాటి అనే బడా ఫ్యామిలీ నుండి ఈయన ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అయితే ఈయన కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా నటించారు. హీరో గానే కాకుండా పాన్ ఇండియా మూవీ బాహుబలి (Bahubali) సినిమాలో భళ్లాలదేవ అనే విలన్ పాత్ర పోషించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి రానా తన బాబాయ్ వెంకటేష్ (Venkatesh) తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో విపరీతమైన బూతులు ఉండడంతో నెగిటివిటీ ఏర్పడింది. కానీ చాలామంది ఈ సిరీస్ ని ఆదరించారు.దాంతో ఈ సిరీస్ కి సీక్వెల్ గా వచ్చిన రానా నాయుడు 2 (Rana Naidu-2 ) వెబ్ సిరీస్ కూడా కూడా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 13 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా రానా నాయుడు -2 ప్రమోషన్స్ లో భాగంగా తన ఆరోగ్య సమస్యలపై మాట్లాడుతూ.. నాకు టెర్మినేటర్ లాగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.
అనారోగ్య సమస్యలపై రానా కామెంట్..
ఆయన తాజాగా ఓ బాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోగ్య సమస్యలపై స్పందించారు.
రానా నాయుడు 2 వెబ్ సిరీస్ లో రానా ఓ స్టిల్ లో టెర్మినేటర్(Terminator) లాగా కనిపిస్తాడు. అయితే దీని గురించి యాంకర్ మీకు కుడి కన్ను గుడ్డి కావడం వల్ల యాక్షన్ సీక్వెన్స్ చేయడం కష్టమయిందా? అని అడగగా.. రానా మాట్లాడుతూ..” నాకు చాలా సంవత్సరాల నుండి కుడి కన్ను కనిపించదు. నేను ఎడమ కన్ను మూసుకుంటే నాకు పూర్తిగా కనిపించదు. చిన్నప్పుడే నాకు కార్నియా సర్జరీ చేశారు. అలాగే నాకు కిడ్నీ కూడా పనిచేయదు. కిడ్నీ ట్రాన్స్లంటేషన్ సర్జరీ కూడా జరిగింది”.
నేనొక టెర్మినేటర్..
“అయితే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఆ టైంలో నా కంట్లో దుమ్ము పడడంతో నీరు వచ్చాయి. అది చూసిన అర్జున్ రాంపాల్ నేను ఏడుస్తున్నాననుకోని ఎందుకలా అని అడిగారు. దాంతో నాకున్న ప్రాబ్లం చెప్పాను. ప్రస్తుతం నాకు ట్రాన్స్ ప్లాంట్స్ బంచ్ ఉన్నందున నేను టెర్మినేటర్ లాంటివాడిని”అంటూ ఫన్నీగా మాట్లాడారు రానా.
Also read: Shiva Jyoti: ఛీ..ఛీ.. ఏంటీ చండాలం.. ఏకంగా బాత్రూం వీడియో రిలీజ్ చేసిన జ్యోతక్క!
ఆ సినిమా సమయంలోనే అసలైన ప్రశాంతత చూసా – రానా
ఇక గతంలో రానా బాహుబలి మూవీ కోసం బరువు పెరిగినప్పుడు చాలామంది ఆయన హెల్త్ బాలేదని ప్రచారం చేశారు. అంతే కాదు ఎంతోమంది రానాని ఏమైందని అడిగారట కూడా.ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ విసిగిపోయిన రానా.. మీరు నాకు ఒక కన్ను,కిడ్నీ ఇవ్వాలనుకుంటే మాత్రమే ప్రశ్నించండి. లేకపోతే సైలెంట్ గా ఉండండని బదులిచ్చారట. ఇక రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమా(Aranya Movie) షూటింగ్ అడవిలో జరిగింది.ఆ టైంలో పక్షులతో, జంతువులతో చాలా ఆనందంగా గడిపానని, అడవిలో తనని ఆరోగ్యం గురించి అడిగి విసిగించేవారే లేరని, ఆ నిశ్శబ్దం తన జీవితంలో చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు. అలా రానా తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ గానే చెబుతూ ఉంటారు.