Rana Daggubati: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోస్ లో రానా దగ్గుబాటి ఒకరు.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రానా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో చాలా చోట్ల రానా లో శేఖర్ కమ్ముల కనిపిస్తాడు. ఇప్పటికీ కూడా ఈ సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. శేఖర్ కమ్ముల బెస్ట్ వర్క్ అని కూడా చాలామంది ఈ సినిమాని చెబుతూ ఉంటారు. రానా కెరియర్ లో చేసినవి చాలా తక్కువ సినిమాలు అయినా కూడా విభిన్నమైన సినిమాలను ఎన్నుకున్నాడు. ప్రతి సినిమాలో తన పాత్రకు ఒక స్కోప్ ఉండేలా చూసుకున్నాడు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అలానే ఈ సినిమాకి సంబంధించి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రానా డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఒకవైపు నటుడుగానే కాకుండా మిగతా రంగాల్లో కూడా రానాకు మంచి అనుభవం ఉంది. చాలా సినిమాలను ఎంకరేజ్ చేయడంలో రానా ఎప్పటికీ ముందుంటాడు. కేరాఫ్ కంచరపాలెం వంటి సినిమా కూడా చాలామందికి రానా ఎంకరేజ్ చేయడం వల్లనే తెలిసిందే అని చెప్పాలి. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఏ సినిమాలో రిలీజ్ అయిన కూడా వాటికి తన వంతు సాయం అందిస్తుంటాడు రానా. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచి టెక్నికల్ గా చాలా సినిమాలకు సంబంధించి ఇన్వాల్వ్ అయ్యాడు. రీసెంట్గా ఐఫా ఫంక్షన్ లో హోస్ట్ గా చేసి చాలామందిని ఆకట్టుకున్నాడు. ఇక రానా టాక్ షో కూడా త్వరలో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సందర్భంగా పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు రానా. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ సినిమా కలెక్షన్స్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : Nayan Vs Dhanush: మాట వినని నయన్.. ధనుష్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్.. ?
కొన్ని సినిమా పోస్టర్స్ మీద నెంబర్స్ టైంపాస్ కి వేస్తామంటూ చెబుతూ వచ్చాడు. అయితే పోస్టర్ మీద నెంబర్స్ చూసి చాలామంది అభిమానులు మా హీరో సినిమాకి ఇంత కలెక్షన్స్ వచ్చాయి అంటూ ఆర్గుమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇదివరకే నాగ వంశీ లాంటి నిర్మాత కూడా పలు సందర్భాల్లో ఫ్యాన్స్ ని హ్యాపీగా చేయటానికి పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా రానా కూడా టైంపాస్ కి వేస్తామని చెప్పడంతో అసలు కలెక్షన్స్ ను ఇకపై నమ్మడం మానేయాలి అని చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఏదైనా ఒక సినిమా సక్సెస్ ని డిసైడ్ చేసేది ఆడియన్స్ మాత్రమే. కొన్ని బాలేని సినిమాలకు కూడా ఫేక్ కలెక్షన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ కూడా మొదలుపెడతారు.