BigTV English

Kantara A Legend Chapter-1: కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. భయంకర రూపంలో దర్శనమిచ్చిన రిషబ్ శెట్టి

Kantara A Legend Chapter-1: కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. భయంకర రూపంలో దర్శనమిచ్చిన రిషబ్ శెట్టి

Kantara A Legend Chapter-1: కన్నడ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాల్లో కెజిఎఫ్ తరువాత  కాంతార అనే చెప్పాలి. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబాలే  ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎలాంటి అంచనాలు లేకుండా 2022 లో కాంతార రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని  అందుకుంది.


రిషబ్ శెట్టిని ఒక్కసారిగా స్టార్ హీరో తో పాటు స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఈ సినిమా తరువాత కాంతార సీక్వెల్ వస్తుంది  అనుకుంటే.. కాంతార ప్రీక్వెల్ రానున్నట్లు రిషబ్ శెట్టి ప్రకటించి ఇంకా  అంచనాలను పెంచేశాడు. కేవలం రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 450 కోట్లను వసూలు చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది.

Horror Series In OTT : వామ్మో.. గజ గజ వణికించే హారర్ సీన్స్.. రాత్రి చూస్తే ఇక అంతే..


ఇక ఇప్పుడు  కాంతార ప్రీక్వెల్ కూడా అంతకుమించి వసూలు చేస్తుందని పోస్టర్స్ ను బట్టే  అర్ధమవుతుంది. తాజాగా కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటిస్తూ  ఒక వీడియోను రిలీజ్ చేశారు. అక్టోబర్ 2, 2025 న ఈ చాప్టర్ 1 ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ రిషబ్ శెట్టి లుక్ ను రివీల్ చేశారు.

” వెలుగు.. వెలుగులో కంటికి అంతా కనిపిస్తుంది. కానీ, అది వెలుగు కాదు, దర్శనం. ముందు జరిగింది.. తరువాత జరగబోయేది అంతా చూపిస్తుంది ఆ వెలుగు. కనపడుతుందా.. ?” అంటూ వెనుక నుంచి వాయిస్ ఓవర్ వస్తుండగా.. రిషబ్ అలానే పైకి చూస్తూ కనిపించాడు. ఇక చివర్లో  ఆ వెలుగుగా రిషబ్ భయంకరమైన  రూపాన్ని  చూపించారు.

Nayan Vs Dhanush: మాట వినని నయన్.. ధనుష్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్.. ?

రక్తంతో తడుస్తున్న  దేహం, ముఖం నిండా రక్తం, ఆ కళ్ళల్లో వెలుగు..  ఒకచేత్తో త్రిశూలం.. మరోచేత్తో పట్టుకొని ఎంతో భయంకరంగా కనిపించాడు. ఇక  దీన్ని మరింత ఎలివేట్ చేసేలా  అంజనీష్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×