BigTV English

Digital Arrest : పాపం రిటైర్డ్ ఇంజనీర్.. మోదీ మాట వినకుండా అడ్డంగా బుక్కయ్యాడు.. రూ.10 కోట్లు పోగొట్టుకున్నాడు

Digital Arrest : పాపం రిటైర్డ్ ఇంజనీర్.. మోదీ మాట వినకుండా అడ్డంగా బుక్కయ్యాడు.. రూ.10 కోట్లు పోగొట్టుకున్నాడు

Digital Arrest : మోసాలు ఎక్కడో జరుగుతాయని తేలికగా తీసుకుంటే నిజంగా మోసపోక తప్పదు. స్కామ్స్ లో ఇరుక్కున్నవారు, కోట్లలో పోగొట్టుకున్నవారు ఎంతో దూరంలో ఉంటారని ఇలాంటివి తమ వరకూ రావని అజాగ్రత్త ఏమాత్రం తగదు. ఇలా అన్నీ తెలిసిన ఓ రిటైర్ ఇంజనీర్ స్కామ్ లో ఇరుక్కుపోయి.. అనుకోని రీతిలో రూ. 10 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇక మోసాలకి, సైబర్ క్రైమ్స్ కు ఎవరూ ఆతీతులు కాదని మరోసారి నిరూపింతమైంది.


తాజాగా మాన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ కోసం వివరించారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్ విషయంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడూ ఫోన్ కాల్ లో కాంటాక్ట్ అవ్వదని… ఇలాంటి విషయాలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సైతం పూసగుచ్చినట్టు వివరించారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఎంతో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న ఓ రిటైర్డ్ ఇంజనీర్ సైతం స్కామర్స్ వలలో చిక్కుకుపోయాడు. వారు చెప్పిన మాటలే నిజమనుకొని నమ్మి.. రూ. 10 కోట్లకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అయితే అసలు ఈ విషయం ఎలా జరిగింది? ఎక్కడి జరిగింది అనేది తెలుసుకుందాం.

సెప్టెంబర్ 25న ఢిల్లీకు చెందిన ఓ 66 ఏళ్ల ఇంజనీర్ కు కొరియర్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఒక ఫోన్ వచ్చింది. అతను పంపించిన పార్సెల్ తమ దాకా చేరిందని.. ఆ పార్శిల్ లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పడంతో నిజం అనుకొని నమ్మాడు. నిజానికి ఇలాంటి విషయాలు ఎప్పుడూ నమ్మకుండా ముందు నుంచి జాగ్రత్తగా ఉన్నప్పటికీ నేరగాళ్లు నమ్మే విధంగా మాట్లాడారు. ముంబై నుంచి చైనాకు మీరు పార్సిల్ పంపించారని.. ఆ పార్సిల్ లో ఆధార్ వివరాలు సైతం ఉన్నాయని.. ముంబై పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టారని బెదిరించడంతో ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఇక అవసరమైతే ముంబై పోలీసులు సైతం వీడియో కాల్ చేసి కాంటాక్ట్ అవుతారని హెచ్చరించారు. మనీలాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారని.. ధ్రువీకరణ కోసం బ్యాంకు వివరాలు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాల్ చేసిన వ్యక్తి వేరొక వ్యక్తిని పరిచయం చేస్తూ… సీబిఐ సీనియర్ అధికారిని అంటూ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి సీరియస్ గా మాట్లాడుతూ ఓ ప్రైవేట్ గదిలో ఉండమని ఆధార్ తో సహా విలువైన డాక్యుమెంట్స్ అన్నీ పంపించాలని… ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి సైతం చెప్పొద్దని హెచ్చరించాడు. దేశం విడిచి ఎక్కడికి వెళ్ళవద్దని అతనిపై నిఘా ఉందని తెలిపాడు.


ఇలా 19 రోజులపాటు జరిగిన ఈ స్కామ్ లో ఆ వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేయించుకున్నారు. డబ్బులు విషయంలో బెదిరిస్తూ అతనిపై ఒత్తిడి తీసుకురావడంతో మూడు వేరువేరు లావాదేవీలలో రూ.10.3 కోట్లు బదిలీ చేశాడు. అక్టోబర్ 14న స్కామర్స్ అతని సోదరుని సైతం విచారణలో భాగం కావాలని కోరారు. దీనితో అనుమానం వచ్చిన వ్యక్తి అతని సోదరుడితో మాట్లాడిన తర్వాత తను మోసపోయాననే విషయాన్ని గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని విన్నవించుకున్నాడు.

ఇక ఇప్పటికే ఎక్కడికక్కడ ఇలాంటి డిజిటల్ అరెస్ట్ క్రైమ్స్ జరుగుతున్నప్పటికీ ప్రజల అప్రమత్తం కావడం లేదు. ఇలాంటి వాటి నుంచి కచ్చితంగా తమను తాము రక్షించుకునే విధంగా ప్రతీ ఒక్కరు ముందడుగు వేయాలి. ఇలాంటి ఫోన్స్ ను లిఫ్ట్ చేయకుండా ఉండటం లేదా వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయాలి. ప్రభుత్వం లేదా పోలీస్ అధికారులు ఎప్పుడూ కూడా నేరుగా వచ్చి కాంటాక్ట్ అవుతారు తప్పా ఇలా ఫోన్ కాల్స్ లో మాట్లాడరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డబ్బులు పంపించమని వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనే నమ్మకూడదని మరోసారి సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ : జియో కస్టమర్స్ కు గుడ్ న్యూస్.. ఏడాదిపాటు అన్లిమిటెడ్ 5G డేటా కేవలం రూ.601కే!

 

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×