Rana Daggubati.. రానా దగ్గుబాటి (Rana Daggubati).. ప్రముఖ బడా నిర్మాత సురేష్ బాబు (Sureshbabu )వారసుడిగా.. మూవీ మొఘల్, దివంగత నిర్మాత రామానాయుడు (Ramanaidu )మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న రానా హీరో గానే కాకుండా పలు ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా మారారు. ముఖ్యంగా అవార్డు ఫంక్షన్లకు హోస్ట్ గా వ్యవహరించే ఈయన పలు టాక్ షోలకి యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇదిలా ఉండగా తన బాబాయ్, ప్రముఖ హీరో వెంకటేష్ (Venkatesh) తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలో దీని సీక్వెల్ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రానా, వెంకటేష్ ను బూతులు తిట్టడంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
వెంకీని బూతులు తిట్టడం పై రానా క్లారిటీ..
అసలు విషయంలోకి వెళ్తే.. వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు 2’. 2023లో విడుదలైన ‘రానా నాయుడు’ కి కొనసాగింపుగా ఇది స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (NET FLIX) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ నిర్వహించగా ఇందులో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు రానా. ముఖ్యంగా రానా.. వెంకటేష్ ను అసభ్య పదజాలంతో దూషించడంపై స్పందించారు.
అందుకే తిట్టాను అంటూ క్లారిటీ..
రానా మాట్లాడుతూ..” నాకు హిందీ భాషలో కొన్ని పదాలకు ఇప్పటికీ కూడా సరైన అర్థం తెలియదు. అలా పార్ట్ వన్ కోసం నేను హిందీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు.. వాటిని కేవలం డైలాగ్స్ గానే చూశాను. కానీ బాబాయిని తిడుతున్నానని అనుకోలేదు. అయితే అవే మాటలు తెలుగులో డబ్బింగ్ చెప్పేటప్పుడు భయపడ్డాను. ఇబ్బంది పడ్డాను. కొన్ని డైలాగులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఈ డైలాగ్స్ చెప్పాలి? అక్కడున్నది బాబాయ్ ..అలా చేస్తే ఎలా ? అని ఆలోచించాను. కానీ నటీనటులుగా ఆయా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఇలాంటివి చేయక తప్పదు అని నాకు నేను అర్థం చేసుకొని అలా బాబాయిని బూతులు తిట్టాల్సి వచ్చింది” అంటూ రానా క్లారిటీ ఇచ్చారు మొత్తానికి అయితే వెబ్ సిరీస్ లో బాబాయ్ పై బూతులు తిట్టడంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు రానా.
నా కల నెరవేరింది..
రానా మాట్లాడుతూ ..”నటుడుగా నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఏదో ఒక ప్రాజెక్టు కోసం తప్పకుండా బాబాయ్ తో కలిసి పనిచేయాలని కలలు కన్నాను. కానీ ఈ సీరిస్ తో నా కల నెరవేరింది. ఎప్పుడు కూడా మేము ఎలాంటి పాత్ర చేయలేదు. ఇది ఒక విభిన్నమైన సిరీస్. సెట్ లో నన్ను నేను మరింత మెరుగుపరుచుకునేలా బాబాయ్ నాకు సహాయం చేశారు. నా పాత్ర పేరు రైనా.. కానీ బాబాయ్ తరచూ రానా రానా అని పిలిచేవారు. బాబాయ్ తో ఉంటే ఆ క్షణాలే వేరు ” అంటూ తన బాబాయ్ తో గడిపిన క్షణాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు రానా.
ALSO READ:Singer Mangli: మంగ్లీపై పెరుగుతున్న నెగిటివిటీ.. ఆమాత్రం తెలియకుండానే పార్టీ ఇచ్చావా అంటూ ఫైర్!