BigTV English

Nikhil: మేమందరం సేఫ్ గా ఉన్నాం.. ప్రమాదంపై స్పందించిన నిఖిల్

Nikhil: మేమందరం సేఫ్ గా ఉన్నాం.. ప్రమాదంపై స్పందించిన నిఖిల్

Nikhil: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 తరువాత నిఖిల్ కి అంత మంచి విజయం దక్కలేదు.అయినా కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. తాజాగా నిఖిల్ నటిస్తున్న చిత్రాల్లో ది ఇండియన్ హౌస్ ఒకటి. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సయయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ తో కలిసి మెగా పిక్చర్స్  నిర్మిస్తుంది. గతేడాది ఎప్పుడో ఈ సినిమాను ప్రకటించారు. కానీ, ఈ సినిమాపై ఒక్క అప్డేట్ కూడా లేదు.  సడెన్ గా నిన్న ఈ సినిమా సెట్ లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఇండియన్ హౌస్ సినిమాపై హైప్ పెరిగింది.


 

సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ లోకి నీళ్లు వచ్చేసి వరదలా ముంచెత్తాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్ తో పాటూ మ‌రికొంత మంది చిత్ర యూనిట్ కూడా ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డార‌ని స‌మాచారం. దీంతో నిఖిల్ కు ఏమైనా అయ్యిందా అని అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇక తాజాగా ఈ ప్రమాదంపై నిఖిల్ స్పందించాడు.


 

” మేమందరం సురక్షితంగా ఉన్నాము. కొన్నిసార్లు ఉత్తమ సినిమా అనుభవాన్ని అందించాలనే మా అన్వేషణలో మేము రిస్క్‌లు తీసుకుంటాము. హెచ్చరిక సిబ్బంది మరియు తీసుకున్న జాగ్రత్తల కారణంగా ఈరోజు మేము ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాము. మేము ఖరీదైన పరికరాలను కోల్పోయాము కానీ దేవుడి దయవల్ల ఎటువంటి మానవ నష్టం జరగలేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమా కాకుండా నిఖిల్ చేస్తున్న మరో చిత్రం స్వయంభు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×