Singer Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ గా పేరు సొంతం చేసుకున్న మంగ్లీ (Singer Mangli) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన స్వరంతో ఎంతోమంది శ్రోతలను అలరించిన ఈమె.. తాజాగా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. జూన్ 10వ తేదీన తన పుట్టినరోజు కావడంతో సన్నిహితులు, స్నేహితులకు చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో ఘనంగా పార్టీ ఇచ్చింది మంగ్లీ. ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ డీజే పెట్టి స్థానికులకు ఇబ్బంది కలిగించడంతో చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన మహిళ ఎస్సై రిసార్ట్ లో పరిశీలించగా బర్తడే పార్టీలో డీజే పెట్టడాన్ని రిసార్ట్ మేనేజర్ అనుమతి లేదని, పైగా మత్తులో తూలుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీంతో పలువురిపై కేసు ఫైల్ చేయడం జరిగింది.
అంతేకాదు ఇక్కడ భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం 48 మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా అందులో 9 మంది గంజాయి తీసుకున్నట్లు వార్తలు రాగా.. పలువురిపై కేసు ఫైల్ చేశారు.అంతేకాదు యాక్ట్రెస్ దివి, కాసర్ల శ్యామ్ కూడా ఈ ఈవెంట్ లో ఉన్నారు.
డ్రెస్ కేసు పై మంగ్లీ రియాక్షన్..
ఇకపోతే మంగ్లీ పై కూడా కేసు ఫైల్ అవ్వడం, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాజాగా మంగ్లీ దీనిపై స్పందించింది. మంగ్లీ వదిలిన వీడియో విన్న తర్వాత చాలామంది నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇంత పెద్ద సెలబ్రిటీ నువ్వు.. అవన్నీ తెలియకుండానే రిసార్ట్ కి వెళ్ళావా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మంగ్లీ మాట్లాడుతూ..” నిన్న ఏదైతే నా బర్తడే పార్టీ జరిగిందో.. ఒక ఇంట్లో నా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నేను పుట్టిన రోజు జరుపుకోవాలని మా అమ్మ నాన్న కోరారు. వారి కోరిక మేరకే వారి సమక్షంలో నేను ఆ బర్తడే వేడుక జరుపుకున్నాను. అక్కడ మా అమ్మానాన్న, వారి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అలాగే లిక్కర్ తో పాటు సౌండ్ సిస్టం కూడా ఉంది.
అవగాహన లేకపోవడం వల్లే..
సౌండ్ సిస్టంకి, లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలనే అవగాహన నాకు అస్సలు లేదు. అయితే అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. నాకు అవగాహన లేకపోవడం వల్ల అలా జరిగింది. ఒకవేళ నాకు ఐడియా గనుక ఉండి ఉంటే.. కచ్చితంగా నేను పర్మిషన్ తీసుకునే దాన్ని. ఎవరైనా చెప్పినా కూడా నేను పర్మిషన్ తీసుకునే దాన్ని. అలా కూడా జరగలేదు. తెలిసి నేను తప్పు చేయలేదు. తెలియకుండానే జరిగిపోయింది. అక్కడ లోకల్ లిక్కర్ తప్ప మరే విదేశీ మద్యం, మత్తు పదార్థాలు అక్కడ మేము ఉపయోగించలేదు. పోలీసులు వెతికినా కూడా అక్కడ ఏమి దొరకలేదు. అయితే పోలీసులు కొంతమందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు కదా..అది ఎప్పుడో ఎక్కడో ఆయన డ్రగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు పాజిటివ్ వచ్చిందని ఈ విషయాన్ని కూడా పోలీసులు తెలిపారు. అందులోనూ మా అమ్మ నాన్నలను పెట్టుకొని నేను ఎందుకు ఇలాంటివి చేస్తాను. ఒక రోల్ మోడల్ గా , ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటున్నాను” అంటూ మంగ్లీ తెలిపింది.
మంగ్లీ మాటలపై నెటిజన్స్ ఫైర్..
ఇక దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ మీడియా మిత్రులను వేడుకుంది మంగ్లీ. కానీ దీనిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఎలా చేస్తాను అని అడిగారు తల్లిదండ్రులు లేకపోతే చేస్తారా..? అసలు అవగాహన లేదు అంటున్నారు.. ఎప్పుడు మీరు ఎలాంటి పార్టీలకు వెళ్లలేదా? అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకుంటారో మీకు తెలియదా? ఇకనైనా మీ నంగనాచి మాటలు ఆపండి.. అంటూ మంగ్లీ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై మంగ్లీ రియాక్షన్ ఏంటో చూడాలి.
ALSO READ:Aamir Khan: రిటైర్మెంట్ పై అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్.. ఎవరన్నారు అది నా చివరి సినిమా అంటూ!