BigTV English

Potatoes: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బంగాళదుంపలు ఎలా తినాలో సులువైన చిట్కాలు ఇదిగో

Potatoes: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బంగాళదుంపలు ఎలా తినాలో సులువైన చిట్కాలు ఇదిగో

మధుమేహం ఉన్నవారు బంగాళదుంపల్ని తినడం మంచిది కాదు. దీనిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. బంగాళదుంపలతో చేసిన ఆహారాన్ని తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటిస్ వ్యాధి మరింతగా ముదిరిపోతుంది. అందుకే బంగాళదుంపలతో చేసిన ఆహారాన్ని డయాబెటిస్ ఉన్నవారు తినరు. కానీ ఒక్కోసారి వాటి రుచి మనసును లాగేస్తుంది. వాటితో చేసిన కర్రీ లేదా బిర్యానీ వంటివి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బంగాళదుంపలను ఎలా తినవచ్చో వైద్యులు సూచిస్తున్నారు.


ఈ బంగాళాదుంప రకాలు
సమతుల్య ఆహారంలో భాగంగా బంగాళదుంపలను ఆస్వాదించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే బంగాళదుంపలు సూపర్ మార్కెట్లలో లభిస్తున్నాయి. వాటిని ‘లో గ్లైసెమిక్ పొటాటోస్’ అంటారు. రస్సెక్ లేదా ఎడాహో అని పిలిచే బంగాళదుంప రకాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటితో అప్పుడప్పుడు మీరు ఆహారాన్ని వండుకోవచ్చు. మధుమేహలు కూడా ఈ రకం బంగాళదుంపలను అప్పుడప్పుడు తినడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి.

వండాల్సిన పద్ధతి
బంగాళదుంపలను ఎలా వండుతామన్నది కూడా ఆధారపడి ఉంటుంది. బంగాళదుంపలను ఉడకబెట్టడం ద్వారా తగ్గించుకోవచ్చు. కాబట్టి గ్లెసెమిక్ తగ్గించుకోవాలంటే వాటిని బాగా ఉడకబెట్టి గుజ్జు రూపంలో చేసుకుని తింటే మంచిది. అలా కాకుండా కాల్చిన లేదా నూనెలో వేయించిన బంగాళదుంపల్ని తింటే గ్లెసెమిక్ సూచిక అధికంగా ఉంటుంది. అదే ఉడికిస్తే మాత్రం చాలా వరకు తగ్గుతుంది.


ఫ్రిజ్ లో పెట్టొద్దు
బంగాళదుంపల్ని ఉడకబెట్టిన తర్వాత అవి బాగా చల్లారేలా చూడాలి. అప్పుడే గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గుతుంది. అలాగే వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదల కూడా నెమ్మదిగా ఉంటుంది. అలాగే బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వంటివి చేయకూడదు. ఉడకబెట్టిన బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో పెడితే దానిలో పిండి పదార్థాలు మరింతగా పెరిగిపోతాయి. ఫలితంగా గ్లూకోజ్ పెరిగిపోతుంది. కాబట్టి బంగాళదుంపలు ఉడికించాక బాగా చల్లబరిచాకే తినాలి. ఒకవేళ బంగాళాదుంప కూరను వండుకున్నా కూడా దాన్ని మీరు పూర్తిగా చల్లారాకే తింటే మంచిది.

ప్రొటీన్ ఆహారాలు కలిపి
బంగాళదుంపలు వండేటప్పుడు ప్రోటీన్ ఉండే ఇతర ఆహారాలను జోడించడం కూడా మంచిది. లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఇతర పదార్థాలను కలిపి వండితే వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు బంగాళదుంపలకు చీజ్ లేదా బాదం పప్పులు వంటివి జోడించడం వల్ల గ్లూకోజ్ పెరుగుదల నెమ్మదిస్తుంది.

వెనిగర్ జోడించి
బంగాళదుంపలకు వెనిగర్ వంటివి జోడించినా కూడా వాటి గ్లూకోజ్ తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇన్సులిన్ స్పైక్ కూడా తగ్గుతుంది. ఉడికించిన బంగాళదుంపను బాగా చల్లబరిచిన తర్వాత దానికి వెనిగర్ ను అప్లై చేయండి. దీనివల్ల గ్లైసిమిక్ సూచిక 43 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

వైద్యులు చెప్పిన సులువైన చిట్కాలు ద్వారా మధుమేహులు కూడా అప్పుడప్పుడు బంగాళదుంప రెసిపీలను ఆస్వాదించవచ్చు. కానీ రోజు తినడం మాత్రం ప్రమాదకరం.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×