Big Stories

Animal Movie : తగ్గేదే లేదంటున్న యానిమల్ మూవీ కలెక్షన్స్ ..

Animal Movie Collections

Animal Movie Collections(Latest news in tollywood):

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా కలెక్షన్స్ జైత్రయాత్ర కంటిన్యూ చేస్తూ ఉంది. ఒకపక్క ఈ చిత్రాన్ని విమర్శించేవారు ఉన్నప్పటికీ.. మూవీ కలెక్షన్స్ పై దాని ప్రభావం అస్సలు పడడం లేదు. ఊర మాస్ యాక్షన్స్ సన్నివేశాలతో.. బోల్డ్ కంటెంట్ తో.. చాలా వైల్డ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇంత అదిరిపోయే రెస్పాన్స్ అందుకోవడం ఆశ్చర్యంగా ఉంది. డిసెంబర్ 1న విడుదలైన ఈ మూవీ ..10 రోజులు గడుస్తున్నా .. దూకుడు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు.

- Advertisement -

పేరుకి బాలీవుడ్ చిత్రం కానీ తెలుగులో.. స్టార్ హీరోలు నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ తో సమానంగా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీలో సందీప్ తన మ్యాడ్నెస్ ని ప్రజలకు వెరైటీగా పరిచయం అయినా ఊహించని విధంగా ఈ మూవీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ ఇప్పటికే 700 కోట్ల కలెక్షన్ మార్కును చేరువయ్యింది. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

- Advertisement -

మొదటి వారంలోనే ఈ మూవీ 338 కోట్ల రూపాయలు వసూలు చేసి తన సత్తా చాటుకుంది. ఇందులో 300 కోట్లు హిందీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కాగా.. తెలుగులో 34 కోట్లు.. తమిళ్లో 2.75 కోట్లు మరోపక్క కన్నడ, మలయాళం లో ఒక మోస్తారు కలెక్షన్స్ సొంతం చేసుకోగలిగింది. ఇక రెండవ వారం శనివారం .. కలెక్షన్స్ విషయానికి వస్తే.. హిందీ వర్షన్ 33 కోట్ల తన ఖాతాలో వేసుకోగా.. తెలుగులో రెండు కోట్లు.. తమిళ్ లో ఓ పాతిక లక్షలు.. ఇక మలయాళం లో అటు ఇటుగా ఓ లక్ష రూపాయల వరకు ఈ మూవీ వసూలు చేయగలిగింది.

ఇక సెకండ్ వీక్ ఆదివారం విషయానికి వస్తే.. ఆక్యుపెన్సి పరంగా మూవీ మంచి స్పీడ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మార్నింగ్ షో కి 40 శాతం వరకు ఆక్యుపెన్సి ఉంటే.. మ్యాట్నీకి 70% ఫస్ట్ షో కి 70% సెకండ్ షోకి 80% వరకు ఆక్యుపెన్సి నమోదయింది. ఇక హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలలో 50 శాతం కు పైగా ఆక్యుపెన్సి ఆదివారం కనిపించింది. కలెక్షన్స్ పరంగా తీసుకున్న పదవరోజు ఈ చిత్రం సుమారు 35 నుంచి 40 కోట్ల మధ్య వరకు వసూలు చేయగలిగింది. ఇక ఓవర్సీస్ లో మొత్తానికి 190 కోట్ల వరకు ఈ సినిమా ఖాతాలో నమోదయ్యాయి. ఇలా అన్ని లెక్కలు కలుపుకుంటే పదవరోజుకి యానిమల్ మూవీ సుమారు 700 కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News