Big Stories

IND Vs SA T20I : ఒక్క బాల్ పడకుండానే టీ-20 మ్యాచ్ రద్దు.. నిరాశలో అభిమానులు..

IND Vs SA T20 1st Match

IND Vs SA T20I : భారతీయులు అధికంగా నివసించే డర్బన్‌లో  సౌతాఫ్రికా-ఇండియా మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు పోటీపడ్డారు. టికెట్లన్నీ దాదాపు అమ్ముడయ్యాయి. కానీ వరుణ దేవుడు సడన్ గా రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

- Advertisement -

సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్  ఇండియా మొదటి టీ 20 మ్యాచ్ డర్బన్‌లో ఆడాల్సింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని అంపైర్లు డిసైడ్ అయ్యారు. అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడి చిత్తడి అయిపోయింది. అప్పటికే స్టడియంకి వచ్చిన అభిమానులు కూడా వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతసేపు చూసినా వర్షం తెరిపి ఇవ్వకపోవడంతో చేసేది లేక మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన తొలి మ్యాచ్‌, అలా  ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిపోయింది. ఇక్కడ ముందుగానే వర్షం పడుతుందనే సంగతి క్రికెట్ సౌతాఫ్రికాకి తెలుసు. అయినా సరే, రిజర్వ్ డే పెట్టలేదనే విమర్శలు తీవ్రంగా వినిపించాయి. అంత దూరం వెళ్లింది ఆడటానికే కదా, ఊళ్లు చూసి రావడానికి కాదు కదా.. అని కొందరు బీసీసీఐపై కామెంట్లు చేస్తున్నారు. అంత టైట్ షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

మూడు ఫార్మట్లలో కలిపి జనవరి 7 వరకు షెడ్యూల్ ఉంది. టీ 20 వరకు మరో మూడు రోజులు రిజర్వ్ డే పెడితే వచ్చే నష్టం ఏముంది?  తిరిగి వచ్చేవాళ్లు జనవరి 10న వచ్చే వారు కదా అంటున్నారు. వాతావరణ శాఖ చెప్పిన తర్వాత కూడా ఇరు బోర్డుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

ఇందులో బీసీసీఐ ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉన్నట్టుందని అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల పెత్తనాలు, ఈగోలకి అశేష క్రికెట్ అభిమానుల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్నారని మాటల తూటాలు విసురుతున్నారు. నిజానికి భారత్‌-సౌతాఫ్రికా సిరీస్‌లతో ఆర్థికంగా బలపడాలని భావించిన సౌతాఫ్రికాకు తొలి మ్యాచ్ రద్దవ్వడంతో తీరని నష్టమే మిగిలింది.

ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మంగళవారం జీక్యూబెర్హా వేదికగా జరగనుంది. వచ్చే టీ 20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఈ టూర్ ఇరుజట్లకు ఉపయోగపడనుంది. ఈ మ్యాచ్ ల ద్వారా ఫైనల్ టీమ్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలని భావించిన ఇరు జట్ల మేనేజ్మెంట్లు కూడా తీవ్ర నిరాశకు గురయ్యాయి.

ఇక్కడ బాగా ఆడి, ప్రపంచకప్ లో చోటు సంపాదించాలని అనుకున్న యువ ఆటగాళ్లు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇలా అందరి ఆశల మీద వరుణుడు నీళ్లు జల్లి వెళ్లిపోయాడు .

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News